Water Maidens : హైదరాబాద్‌లో సాగర కన్యలు సందడి చేస్తున్నారు. కూకట్‌పల్లిలోని మెట్రో ట్రక్ పార్కింగ్ ఏరియాలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ డబుల్ డెక్కర్‌లో జల కన్యలు విహరిస్తున్నారు. అసలే సమ్మర్ టైం.. సెలవులు కూడా ఉండటంతో పిల్లాపెద్దలు భారీ సంఖ్యలో సాగర కన్యలను చూసేందుకు క్యూ కడుతున్నారు. ఇంతకీ ఎవరీ జలకన్యలు ?
We’re now on WhatsApp. Click to Join
సాగర కన్యల ఎగ్జిబిషన్‌ను ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహిస్తున్నారు. స్పెయిన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సాగర కన్యల బృందం మమేడ్ షోతో ఆకట్టుకుంటోంది. నడుము వరకు చేప ఆకారమున్న సాగర కన్యలు నీటిలో హల్‌చల్ చేస్తున్నారు. సాధారణంగానైతే సముద్ర ప్రాంతాలను కలిగి ఉన్న దేశాల్లో జలకన్యల థీమ్‌తో ప్రత్యేక ఎగ్జిబిషన్‌లను ఏర్పాటు చేస్తుంటారు. అలాంటి థీమ్ కలిగిన ఎగ్జిబిషన్ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ ఏర్పాటు కావడం విశేషం. జలకన్య రూపంలో ఉన్న ముగ్గురు యువతులు నీటిలో విన్యాసాలు చేస్తూ అలరిస్తున్నారు. జలకన్యల రూపంలో ఉన్న యువతులతో సందర్శకులు సెల్ఫీలు దిగుతున్నారు. ఈ ఎగ్జిబిషన్‌ను చూస్తుంటే.. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సాహస వీరుడు సాగర కన్య(Water Maidens) మూవీ సీన్లు గుర్తుకొస్తున్నాయని సందర్శకులు చెబుతున్నారు.