Amit Shah: వాషింగ్‌ పౌడర్‌ నిర్మా హోర్డింగ్స్‌తో అమిత్‌ షాకు ఆహ్వానం

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah)కు స్వాగతం పలుకుతూ హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. కానీ అందులో ట్విస్ట్ ఉంది. ఈ పోస్టర్‌లో ఎక్కడా హోంమంత్రి బొమ్మ కనిపించడం లేదు. అందులో వాషింగ్ పౌడర్ నిర్మా అమ్మాయి ఫోటో ఉంది.

  • Written By:
  • Publish Date - March 12, 2023 / 12:14 PM IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah)కు స్వాగతం పలుకుతూ హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. కానీ అందులో ట్విస్ట్ ఉంది. ఈ పోస్టర్‌లో ఎక్కడా హోంమంత్రి బొమ్మ కనిపించడం లేదు. అందులో వాషింగ్ పౌడర్ నిర్మా అమ్మాయి ఫోటో ఉంది. ఆదివారం (మార్చి 12) జరిగిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 54వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. నిర్మా బాలికతో పాటు ఇతర పార్టీల నుంచి పార్టీలో చేరిన బీజేపీ నేతల పేర్లను పోస్టర్‌లో రాశారు. తెలంగాణలోని అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఈ పోస్టర్‌లను ఏర్పాటు చేసింది.

పోస్టర్‌లో ఈ నేతల పేర్లు

పోస్టర్‌లో నిర్మా అమ్మాయి చిత్రంతో పాటు బీజేపీ నేతలు హిమంత బిస్వా శర్మ, నారాయణ్ రాణే, సువేందు అధికారి, ఈశ్వరప్ప, జ్యోతిరాదిత్య సింధియా, తదితరుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ నేతలంతా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరారు. పోస్టర్ పైన ‘వాషింగ్ పౌడర్ నిర్మా’ అని ఆంగ్లంలో రాసి, కింద ‘వెల్ కమ్ టు అమిత్ షా’ అని రాసి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పది తలల రావణుడిగా చిత్రీకరిస్తూ బిఆర్ఎస్ హైదరాబాద్ అంతటా పోస్టర్లు కూడా వేసింది. పోస్టర్‌లో ప్రధానిని ‘ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి, ‘వంచన తాత’ అని అభివర్ణించారు.

నిర్మా సర్ఫ్‌తో బట్టలపై మరకలు మాయమై పోయినట్లు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బీజేపీలో చేరితే వారికి అంటిన మరకలు కూడా పోతాయని చురకలంటిస్తూ అమిత్‌ షా పర్యటిస్తున్న మార్గాల్లో పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. నిర్మా అడ్వర్‌టైజ్‌లో కనిపించే అమ్మాయి తల ప్లేస్‌లో బీజేపీలో చేరిన పలువురు నేతల ఫొటోలను ఉంచారు.

Also Read: AP Govt: నెలాఖరులోగా బకాయిల చెల్లింపు.. మార్చి 16న ఏపీ ప్రభుత్వం నిర్ణయం

CISF రైజింగ్ డే పరేడ్‌లో అమిత్ షా

ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సీఐఎస్‌ఎఫ్ 54వ రైజింగ్ డే పరేడ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు ట్వీట్‌లో షా CISF భారతదేశ అంతర్గత భద్రతకు మూలస్తంభాలలో ఒకటిగా అభివర్ణించారు. రానున్న రోజుల్లో సీఐఎస్‌ఎఫ్‌ని ఆధునీకరిస్తామని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఇందుకోసం సాంకేతికత సాయం తీసుకోనున్నారు. ఈ సందర్భంగా విధి మార్గంలో నడుస్తూ సిఐఎస్ఎఫ్ జవాన్ల త్యాగాన్ని కూడా షా గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కే. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) కుమార్తె కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం శనివారం (మార్చి 11) ఢిల్లీలో సుమారు 9 గంటల పాటు విచారణ చేసిన తరుణంలో అమిత్ షాపై బీఆర్‌ఎస్ పోస్టర్ వార్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణం కేసులో ఈడీ అడిగిన ప్రశ్నలకు కవిత సమాధానమిచ్చింది. ఈనెల 16న మరోసారి కవితని ఈడి ప్రశ్నించనుంది.