Congress Vs MIM: అసెంబ్లీలో మాటల యుద్ధం, అక్బర్ వ్యాఖ్యలపై రేవంత్ ఫైర్!

  • Written By:
  • Updated On - December 21, 2023 / 05:57 PM IST

ఇవాళ జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కూడా వాడీవేడిని రేపాయి. ముఖ్యంగా ఎంఐంఎం, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. నువ్వానేనా అన్నట్టుగా పోటాపోటీగా మాటల తుటాలు పేల్చారు. విద్యుత్ బకాయిలపై సీఎం రేవంత్ మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల పేర్లు ప్రస్తావించగా, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కలుగజేసుకొని బీఆర్ఎస్ హయాంలో పాతబస్తీ అభివృద్ధి చెందిందని  అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.

బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ అందిందన్నారు. పాతబస్తీలో గత బీఆర్ఎస్ హయాంలో రూ.25 వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. దీంతో అక్బర్ మరోమారు కలుగజేసుకొని ఇతర అంశాలను ప్రస్తావిస్తూ.. ఎఐంఎంను బీజీపీ బీటీమ్ గా కాంగ్రెస్ చీత్రికరించిందని ఫైర్ అయ్యారు.

ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి పైర్ అయ్యారు. తెలంగాణ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అజారుద్దీన్, షబ్బీర్ అలీని ఓడించడానికి ఎంఐం పనిచేసిందని, సాటి ముస్లింలను ఓడించిన ఘనత ఎంఐఎందేనని సీఎం ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంతో ఎంఐఎం కలిసి అనేక చర్యలకు పాల్పడిందని, ఎంఐఎం గురించి పెద్ద కథే ఉందని ఆయన ప్రస్తావించారు. దీంతో అక్బర్ మాట్లాడుతూ కాంగ్రెస్ తో కలిసి పనిచేయబోం అని మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు రియాక్ట్ అవుతూ అక్బరుద్దీన్ సభను తప్పుదొవ పట్టించవద్దని సూచించగా,  డిప్యూటీ సీఎం భట్టి అక్బర్ వ్యాఖ్యలను ఖండించారు. దీంతో సభలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

Also Read: Covid Deaths: ఇండియాపై కరోనా పంజా, 2 వారాల్లో 23 మంది మృతి