War of Governor and CM : సీన్ మారిందా? మార్చారా? మ‌ళ్లీ సీఎంవో, గ‌వ‌ర్న‌ర్ ఢీ!

War of Governor and CM : సీన్ మారిందా? బీజేపీ, బీఆర్ఎస్ సీన్ ను మార్చుతున్నాయా? అనే అనుమానం గ‌వ‌ర్న‌ర్ తీసుకున్న నిర్ణ‌యంతో వ‌స్తోంది

  • Written By:
  • Updated On - September 25, 2023 / 03:43 PM IST

War of Governor and CM : సీన్ మారిందా? బీజేపీ, బీఆర్ఎస్ సీన్ ను మార్చుతున్నాయా? అనే అనుమానం గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై తీసుకున్న నిర్ణ‌యంతో తెర‌మీద‌కు వ‌స్తోంది. గ‌త రెండేళ్లుగా రాజ్ భ‌వ‌న్, ప్ర‌గ‌తి భ‌వ‌న్ మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం జ‌రుగుతోంది. అయితే, ఇటీవ‌ల కేసీఆర్, త‌మిళ సై ఒకే వేదిక‌పై క‌నిపించ‌డంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక‌ట‌య్యాయ‌ని తెలంగాణ స‌మాజం ఫిక్స్ అయింది. అంతేకాదు, ఆర్టీసీ విలీనంతో పాటు ప‌లు పెండింగ్ లో ఉన్న వాటిని గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై క్లియ‌ర్ చేశారు. దీంతీ బీఆర్ఎస్, బీజేపీ ఒకే తానులో ముక్క‌లంటూ కాంగ్రెస్ చేసిన ప్ర‌చారానికి రాజ‌ముద్ర‌లా తెలంగాణ స‌మాజంపై ప‌డింది.

రాజ్ భ‌వ‌న్, ప్ర‌గ‌తి భ‌వ‌న్ మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం (War of Governor and CM)

హ‌ఠాత్తుగా ఏమైందో తెలియ‌దు. గ‌త రెండు రోజులుగా సీన్ మారిన‌ట్టు క‌నిపిస్తోంది. దానికి త‌గిన విధంగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై గ‌వ‌ర్న‌ర్ కోటాలోని ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల పేర్ల‌ను తిర‌స్క‌రించారు. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 171(5)ను బ‌య‌ట‌కు తీశారు. దాని ప్ర‌కారం నిర్ధారిత అంశాల్లోని ఐదింటిలో ఏ ఒక్క దానికి కూడా గ‌వ‌ర్న‌ర్ కోటాలో ప్ర‌గ‌తిభ‌వ‌న్ ఎంపిక చేసి పంపిన దాసోజు శ్ర‌వ‌ణ్‌, మాజీ ఎమ్మెల్యే కుర్రాల పేర్లు లేవ‌ని తేల్చేశారు. ఎమ్మెల్సీలుగా వాళిద్ద‌ర్ని            (War of Governor and CM)  గుర్తించ‌లేమ‌ని రాజ్ భ‌వ‌న్ చెప్పేసింది. దీంతో మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్, సీఎం మ‌ధ్య గ్యాప్ పెరిగింద‌నే భావ‌న క‌లుగుతోంది.

Also Read : Varahi Yatra 4th Schedule : అక్టోబర్‌ 1 నుంచి పవన్ నాల్గో విడత వారాహి యాత్ర

గ‌త రెండు రోజులుగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ తెర‌మీద‌కు మ‌ళ్లీ వ‌చ్చింది. ఆ కేసులో ఈసారి క‌విత అరెస్ట్ ఖాయ‌మంటూ బీజేపీ చెబుతోంది. అంతేకాదు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఆమె అరెస్ట్ ను నిర్థారిస్తున్నారు. రాబోవు ఎన్నిక‌ల కోసం సానుభూతి అస్త్రాన్ని ప్ర‌యోగించ‌డానికి ఎమ్మెల్సీ క‌విత‌ను బీజేపీ అరెస్ట్ చేయిస్తోంద‌ని చెబుతున్నారు. దానికి అనుగుణంగా కేసీఆర్ కూడా ఓకే చెప్పార‌ని వివ‌రిస్తున్నారు. ఆ రెండు పార్టీలు క‌లిసి సానుభూతి కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని తెలంగాణ స‌మాజాన్ని అప్ర‌మ‌త్తం చేశారు. ఏ క్ష‌ణ‌మైనా క‌విత అరెస్ట్ ఖాయ‌మంటూ స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. మ‌రో వైపు మ‌హిళా బిల్లు మీద క‌విత గ‌ళం విప్పుతున్నారు. ఆ బిల్లు ద్వారా బీజేపీ మోసం చేసింద‌ని విమ‌ర్శిస్తున్నారు.

మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్, సీఎం మ‌ధ్య గ్యాప్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవ‌ల మౌనంగా ఉంటున్నారు. ఆయ‌న ప్ర‌గ‌తిభ‌వ‌న్ లోప‌ల ఏమి చేస్తున్నారో, తెలియ‌దు. కానీ, ఎన్నిక‌ల వేళ ఆయ‌న దూకుడు త‌గ్గింది. క‌ల్వ‌కుంట్ల కుటుంబం లీడ‌ర్లు ఎక్క‌డా బీజేపీని టార్గెట్ చేయ‌డంలేదు. కేవ‌లం కాంగ్రెస్ పార్టీని మాత్రమే లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు. ఇదంతా గ‌మ‌నించిన తెలంగాణ స‌మాజం బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య ఫిక్సింగ్ జ‌రిగింద‌ని న‌మ్ముతున్నారు.అంతేకాదు, బీజేపీలోని సీనియ‌ర్లు కూడా అధిష్టానం వాల‌కంపై విసిగిపోయారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో ఉన్న క‌విత‌ను అరెస్ట్ చేయ‌క‌పోవ‌డం పార్టీని దెబ్బ‌తీసింద‌ని వాళ్లు న‌మ్ముతున్నారు. అందుకే, ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించుకుంటున్నారు. ర‌హ‌స్య మీటింగ్ లు పెట్టుకుని భ‌విష్య‌త్ కు బాటలు వేసుకుంటున్నారు.

సీఎంవో ఆఫీస్ నుంచి వెళ్లిన ఎమ్మెల్సీల పేర్ల‌ను తిర‌స్కరించ‌డం(War of Governor and CM)

బీజేపీ, బీఆర్ఎస్ ఒక‌టి కాద‌ని చెప్ప‌డానికి ఆ రెండు పార్టీలు మ‌ళ్లీ గేమాడుతున్నాయా? అనే భావం క‌లుగుతోంది. అందుకే, లిక్క‌ర్ స్కామ్ కు మ‌ళ్లీ ప‌దును పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురి వాగ్మూలం తీసుకున్న ఈడీ తాజాగా క‌విత‌కు స‌మ‌న్లు జారీ చేసింది. కానీ, విచార‌ణ‌కు హాజ‌రు కావ‌డానికి టైమ్ ఇచ్చింది. తాజాగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై సీఎంవో ఆఫీస్ నుంచి వెళ్లిన ఎమ్మెల్సీల పేర్ల‌ను తిర‌స్కరించ‌డం  (War of Governor and CM)    ఆ రెండు పార్టీలు ఒక‌టి కాద‌ని చెప్పే ప్ర‌య‌త్న‌మా? అనే అనుమానం క‌లుగుతోంది.

Also Read : KCR: మంత్రులపై కేసీఆర్ అసంతృప్తి, కారణమిదే!