Site icon HashtagU Telugu

WADRA Likely To Get HYDRA: వరంగల్ లో 170 సరస్సులపై హైడ్రా ఫోకస్

WADRA Likely To Get HYDRA

WADRA Likely To Get HYDRA

WADRA Likely To Get HYDRA: తెలంగాణలో హైడ్రా దూకుడు కొనసాగుతుంది. గత మూడు నెలలుగా నగరంలో అక్రమ కట్టడాలను నేలకూలుస్తున్న ఈ సంస్థ అక్కినేని నాగార్జున అక్రమ కట్టడాన్ని కూల్చేసి సంచలనంగా మారింది. అయితే హైడ్రా(HYDRA)ని రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశ పెట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో భారీగా చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, త్వరలో హైడ్రా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనునంట్లు సమాచారం అందుతుంది. ఇటీవల ఖమ్మంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైడ్రాను అన్ని జిల్లాలోనూ ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేశారు.

హైడ్రా వరంగల్ లో అడుగుపెట్టబోతుంది. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి సంచలనం సృష్టిస్తున్నహైడ్రా ఏజెన్సీ వరంగల్ లో కార్యకలాపాలు చేపట్టాలని పెద్ద ఎత్తున వినతులు వస్తున్న నేపథ్యంలో హైడ్రా వరంగల్ లోని అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిథిలో కనీసం 170 సరస్సులు 4,993.66 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇది కాకుండా జిడబ్ల్యుఎంసీలో విలీనమైన 42 గ్రామాల్లో చెరువులు ఉన్నాయి. నీటిపారుదల విభాగం పర్యవేక్షణలో సరస్సుల సరిహద్దులను నిర్ధారించడానికి డ్రోన్‌లను ఉపయోగించి డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డిజిపిఎస్) సహాయంతో ఇప్పటికే 75 సరస్సులను సర్వే చేయడం ప్రారంభించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

వరంగల్ ప్రాంతంలో ఆక్రమణకు గురైన భూమిని గుర్తించేందుకు రెవెన్యూ, భూ సర్వే రికార్డులతో డేటాను సరిపోల్చనున్నారు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం వడ్డేపల్లి చెరువు 556.32 ఎకరాలు, భద్రకాళి చెరువు 495.89 ఎకరాలు, రంగసముద్రం ట్యాంకు 190.53 ఎకరాలు, చిన్న వడ్డేపల్లి చెరువు 70.74 ఎకరాలు, వరంగల్ కోటలోని గుండ్ల చెరువు 26.81 ఎకరాలు, బంధం చెరువు 4.5 ఎకరాలు విస్తరించి ఉంది. అయితే ఇందులో భారీగా అక్రమ కట్టడాలు వెలిశాయి. ఈ నేపథ్యంలో వరంగల్ పరిథిలో చెరువుల అక్రమాలకు గురైన వివరాలను బట్టి ముందుకెళ్లనుంది.

Also Read: Cloud Burst In Tadwai Forests : ములుగు అడవులను వణికించిన క్లౌడ్ బరస్ట్.. అసలేం జరిగింది ?