Telangana Elections Results : కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన ఓటర్లు

కాంగ్రెస్ నుండి గెలిచి..బిఆర్ఎస్ లో చేరి..బరిలోకి దిగిన నేతలకు సైతం షాక్ ఇచ్చారు

  • Written By:
  • Publish Date - December 3, 2023 / 03:21 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ ఇచ్చారు. మార్పు కావాలి..కాంగ్రెస్ రావాలి అనే నినాదానికి జై కొట్టారు. బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల కు భారీ షాక్ ఇస్తూ..కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. ఆలాగే కాంగ్రెస్ నుండి గెలిచి..బిఆర్ఎస్ లో చేరి..బరిలోకి దిగిన నేతలకు సైతం దెబ్బ కొట్టారు. మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా వారిలో 9 మంది ఓటమి పాలయ్యారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన హరిప్రియ నాయక్, రేగా కాంతరావు, వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్ రెడ్డి, జాజుల సురేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గండ్రవెంకటరమణా రెడ్డి, ఆత్రం సక్కు, డి.సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు బీఆర్ఎస్ లో చేరారు. ఈ క్రమంలో వీరిలో 9 మందిని ప్రజలు ఓడించారు. ఈసారి బీఆర్ఎస్‌పై పోటీ చేసిన వీరిలో ఎల్బీనగర్ నుంచి, సుదీర్ రెడ్డి, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డిలు మాత్రమే గెలుపొందారు. వీరిలో ఆత్కం సక్కుకు కేసీఆర్ టికెట్ నిరాకరించగా పోటీకి దూరంగా ఉన్నారు. మిగతా 9 మంది ఓటమి పాలయ్యారు. ఇక టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర రావులు సైతం ఓటమి పాలయ్యారు. ఇక బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ గజ్వేల్, హుజూరాబాద్ రెండు చోట్ల పోటీ చేయగా రెండు స్థానాల్లో ఓటమి చెందారు.

Read Also : Telangana Elections Results : ఫస్ట్ టైం అసెంబ్లీ లో అడుగుపెడుతున్న అభ్యర్థులు