Cash For Vote: మునుగోడులో అభ్యర్థులకు ఝలక్.. డబ్బులిస్తేనే ఓట్లు!

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ రోజున కొందరు మహిళలు రాజకీయ పార్టీలకు షాకిస్తున్నారు. బంగారిగడ్డ లెనిన్ కాలనీలో ఓటు వేసేందుకు

  • Written By:
  • Updated On - November 3, 2022 / 04:56 PM IST

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ రోజున కొందరు మహిళలు రాజకీయ పార్టీలకు షాకిస్తున్నారు. బంగారిగడ్డ లెనిన్ కాలనీలో ఓటు వేసేందుకు మహిళలు నిరాకరిస్తున్నారు. తులం బంగారం, ₹ 40 వేలు ఇస్తామని ఆశపెట్టిన పార్టీలు, ఇప్పుడు ఇవ్వడం లేదని మండి పడుతున్నారు. తాము ఓటు వేయబోమని తేల్చి చెప్పారు. అంతేకాకుండా.. మర్రిగూడ మండలం అంతంపేట గ్రామంలో మొత్తం ఓట్లు 2000 వచ్చాయి. అయితే కొంత మందికే డబ్బులివ్వడంతో మేము ఓట్లేయమని గ్రామస్తుల ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు కేవలం 200 ఓట్లే పోలైనట్టు సమాచారం.

మొన్నటి వరకు హుజూరాబాద్‌ను అత్యంత ఖరీదైన ఉపఎన్నికగా పరిగణించాం. కానీ మునుగోడు హుజూరాబాద్‌ను దాటింది. ఒక్క ఓటుకు 5000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ఓ గ్రామంలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. కొరటికల్ గ్రామస్తులు నగదు పంపిణీ చేయలేదని నిరసన తెలిపారు. చుట్టుపక్కల గ్రామాలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు డబ్బు మరియు మద్యం ఇచ్చినప్పటికీ వారు కొరటికల్ గ్రామాన్ని మిస్ అయ్యారు.

చుట్టుపక్కల గ్రామాలకు ఒక్కొక్కరికి రూ.5000 నుంచి రూ.10వేలు, ఒక తులాల బంగారం ఇస్తున్నారని తెలుసుకున్న కొరటికల్ గ్రామస్తులు వివిధ పార్టీల నాయకుల ఎదుట నిరసన తెలిపారు. డబ్బు, మద్యం ఇవ్వడంలో ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. ఇక గత నెల రోజులుగా మునుగోడు నియోజకవర్గంలోనే రూ.200 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం. భారత ఎన్నికల చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా మునుగోడు రికార్డులకెక్కేంది.