Site icon HashtagU Telugu

Vote for Note : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

Vote for note case hearing adjourned to November 14th

Vote for note case hearing adjourned to November 14th

Vote For Note Case : ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసు విచారణ జరిపే న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ఈ కేసు విచారణను నవంబర్ 14కు వాయిదా వేసినట్లు నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఆటు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరింది. ఆ తర్వాత 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ క్యాండిటేట్‌కు డబ్బులు ఇవ్వజూపగా.. ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయి.

ఈకేసులో నాటి టీడీపీ నేత, ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సెప్టెంబర్ 24న ఈ కేసును నాంపల్లి కోర్టు విచారించగా..కోర్టుకు మత్తయ్య హాజరయ్యాడు. సీఎం రేవంత్ సహా మిగతా నిందితులు గైర్హాజరయ్యారు. దీంతో అక్టోబర్ 16న సీఎం రేవంత్, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇవాళ కోర్టు విచారణకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరు కావాల్సి ఉండగా.. ఆయన ఇతర పనుల రీత్యా హాజరుకాలేకపోయారు. కాగా, జడ్జీ లీవ్‌లో ఉండటంతో ఈ కేసు విచారణను నవంబర్‌ 14వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.

కాగా, ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఈ కేసు దర్యాప్తు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని, కాబట్టి కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై ఇటీవల సుప్రీం కోర్టు కీలకత తీర్పు వెల్లడించింది. ”కేవలం అనుమానం పైనే పిటిషన్‌ వేశారు. అందుకే ఈ పిటిషన్‌లో మేం జోక్యం చేసుకోలేం. భవిష్యత్తులో సీఎం గనుక జోక్యం చేసుకుంటే మళ్ళీ కోర్టును ఆశ్రయించండి” అని స్పష్టం చేసింది.

Read Also: Omar Abdullah : జమ్ముకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం