Site icon HashtagU Telugu

Telangana : మహబూబ్‌న‌గ‌ర్‌లో వాలీబాల్ అకాడమీ.. క్రీడాకారులు స‌ద్వినియోగం చేసుకోవాల‌న్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌

Srinivas Goud

Srinivas Goud

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని పటిష్టం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పోర్స్ట్ మినిస్ట‌ర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ అకాడమీని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి వాలీబాల్ అకాడమీ కోసం క్రీడాకారుల ఎంపిక కొనసాగుతుందని.. అర్హులైన క్రీడాకారులు అకాడమీ ఎంపికలకు హాజరు కావాలన్నారు. 14 నుంచి 18 సంవత్సరాల వయసులోపు బాల బాలికల ఎంపికలో మెరుగైన ప్రదర్శన చేసిన క్రీడాకారులను అధికారులు ఎంపిక చేస్తారని వెల్లడించారు.

అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులను తయారు చేసేందుకు అధికారులు నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ఎలాంటి అదనపు సదుపాయాలు అవసరమైనా కల్పించి అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో బాక్సర్ నిఖత్ జరీన్, టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్ ఆకుల శ్రీజ దేశంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు ఎంపికయ్యారని, చక్కటి సౌకర్యాలు కల్పించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం క్రీడలకు పెద్దపీట వేస్తూ ఉందని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు

Exit mobile version