Voice of BRS : కాంగ్రెస్ తో కామ్రేడ్లు? క‌మ్యూనిస్ట్ ల‌పై మంత్రి హ‌రీష్‌ యుద్ధం!

తెలంగాణ రాజ‌కీయాల్లో స‌మీక‌ర‌ణాలు (Voice of BRS)మారిపోతున్నాయి. జాతీయ స్థాయి ఈ్వ‌కేష‌న్ల‌కు అనుగుణంగా మ‌లుపు తీసుకుంటున్నాయి.

  • Written By:
  • Publish Date - July 25, 2023 / 02:37 PM IST

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో స‌మీక‌ర‌ణాలు (Voice of BRS) వేగంగా మారిపోతున్నాయి. జాతీయ స్థాయి ఈ్వ‌కేష‌న్ల‌కు అనుగుణంగా రాష్ట్ర రాజ‌కీయాలు మ‌లుపు తీసుకుంటున్నాయి. కామ్రేడ్ల‌తో స్నేహం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ల‌ను దూరం చేసుకునేలా వాయిస్ పెంచారు. అందుకు ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం మంత్రి హ‌రీశ్ రావు సిద్దిపేట కేంద్రంగా చేసిన వ్యాఖ్యలు. వాటిని నిశితంగా ప‌రిశీలిస్తే, రాబోవు ఎన్నిక‌ల నాటికి ఉభ‌య క‌మ్యూనిస్ట్ ల‌ను కూడా బీఆర్ఎస్ టార్గెట్ చేయ‌నుంది. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన కామ్రేడ్లు కూడా స్వ‌రాన్ని పెంచారు.

ఉభ‌య క‌మ్యూనిస్ట్ ల‌ను కూడా బీఆర్ఎస్ టార్గెట్ (Voice of BRS) 

జాతీయ స్థాయిలో ఏర్ప‌డిన విప‌క్ష కూట‌మి(ఇండియా)కు దూరంగా బీఆర్ఎస్  (Voice of BRS) పార్టీ ఉంటుంది. అదే స‌మ‌యంలో బీజేపీకి ప‌రోక్షంగా ద‌గ్గ‌ర అయిందని క‌మ్యూనిస్ట్ ల అనుమానం. ఎన్డీయే కూట‌మి స‌మావేశానికి కూడా బీఆర్ఎస్ దూరంగా ఉన్న‌ప్ప‌టికీ బీజేపీకితో మ్యాచ్ ఫిక్సింగ్ గేమాడుతోంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో ఎమ్మెల్సీ క‌విత‌ను అరెస్ట్ చేయ‌క‌పోవ‌డం, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ ను అక‌స్మాత్తుగా మార్చేయ‌డాన్ని గ‌మ‌నించిన తెలంగాణ స‌మాజం మోడీ, కేసీఆర్ మ‌ధ్య బంధాన్ని న‌మ్ముతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో నాట‌కం ఆడ‌నున్నాయ‌ని మారుమూల గ్రామాల‌కు ప్ర‌చారం వెళ్లింది.

బీజేపీ, బీఆర్ఎస్ క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో నాట‌కం

క‌మ్యూనిస్ట్ లు ఎప్పుడూ బీజేపీకి వ్య‌తిరేకం. రైట్ వింగ్ కు వ్య‌తిరేకంగా లెఫ్ట్ పార్టీలు ద‌శాబ్దాలు పోరాటం చేస్తున్నాయి. సిద్ధాంత ప‌రంగా ఆ రెండు వింగ్ లు విభిన్నం. అందుకే, బీజేపీ కాకుండా ఏ పార్టీ అధికారంలోకి రావ‌డానికైనా క‌మ్యూనిస్ట్ లు అంగీక‌రిస్తారు. అలాంటి రైట్ వింగ్ పార్టీ బీజేపీకి ప్ర‌స్తుతం బీఆర్ఎస్ పార్టీ  (Voice of BRS) తెర వెనుక మ‌ద్ద‌తుగా నిలుస్తుంద‌ని కామ్రేడ్ల అభిప్రాయం. అందుకే, బీఆర్ఎస్ పార్టీ వాల‌కాన్ని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కూనంనేని సాంబ‌శివ‌రావు విమ‌ర్శిస్తున్నారు. మంత్రి హ‌రీశ్ రావు చేసిన కామెంట్ల‌పై మండిప‌డుతున్నారు. మునుగోడు గెలుపు వెనుక క‌మ్యూనిస్ట్ లు లేరా? అంటూ నిల‌దీస్తున్నారు.

మంత్రి హ‌రీశ్ రావు చేసిన కామెంట్ల‌పై  కూనంనేని మండిప‌డుతున్నారు

జాతీయ స్థాయి ఈక్వేష‌న్ల‌ను అప్ప‌ట్లో ప‌క్క‌న పెట్టిన క‌మ్యూనిస్ట్ లు మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీకి మ‌ద్ధ‌తు ప‌లికారు. ఆ రోజున బీజేపీకి వ్య‌తిరేకంగా కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. అందుకే, కామ్రేడ్లు అండ‌గా ఉప ఎన్నిక‌ల్లో నిలిచారు. ఆ త‌రువాత ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ తెర మీద‌కు వ‌చ్చింది. యూ టర్న్ తీసుకున్న కేసీఆర్ ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల‌తో స‌ఖ్య‌త‌ను పెంచారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ్యాచ్ ఫిక్సింగ్ దిశ‌గా బీజేపీ, బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నాయ‌ని ప్ర‌త్య‌ర్థులు విశ్వసిస్తున్నారు. ఈ ప‌రిణామం బీఆర్ఎస్ పార్టీకి కామ్రేడ్లు దూరం జ‌ర‌గ‌డానికి కార‌ణంగా ఉంది. అందుకే, ముంద‌స్తుగా క‌మ్యూనిస్ట్ ల‌ను టార్గెట్ చేస్తూ (Voice of BRS) మంత్రి హ‌రీశ్ గ‌ళం విప్పారు.

Also Read : BRS Politics: కోమటిరెడ్డికి బిగ్ షాక్.. కారెక్కిన యాదాద్రి ముఖ్యనేత

జాతీయ స్థాయిలో ఏర్ప‌డిన విప‌క్ష కూట‌మి(ఇండియా)లో కాంగ్రెస్, క‌మ్యూనిస్ట్ పార్టీల భాగ‌స్వామ్యం చాలా విడ‌దీయ‌రానిది. గతంలోనూ ఎన్డీయేను నిలువ‌రించ‌డానికి యూపీఏ-1లో కీల‌క భాగ‌స్వాములుగా కామ్రేడ్లు ఉన్నారు. ఇప్పుడు బీజేపీ ప్ర‌భుత్వాన్ని దించేయ‌డానికి విప‌క్ష కూట‌మిలో తిరిగి క‌మ్యూనిస్ట్ లు కీల‌కంగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోనూ, రాష్ట్రాల్లోనూ బీజేపీకి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా మ‌ద్ధ‌తు ఇచ్చే పార్టీల‌కు కామ్రేడ్లు దూరంగా ఉంటారు.

Also Read : CM KCR: కామారెడ్డి లేదా పెద్దపల్లి.. కేసీఆర్ పోటీ చేసేది ఇక్కడ్నుంచే?

తాజా ఈక్వేష‌న్లో తెలంగాణాలోనూ కాంగ్రెస్ పార్టీకి రాబోవు ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్ట్ లు మ‌ద్ధ‌తు ప‌ల‌క‌నున్నారు. అందుకే, క‌మ్యూనిస్ట్ ల‌ను విమ‌ర్శించిన మంత్రి హ‌రీశ్ రావు మీద పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తిర‌గ‌బ‌డ్డారు. ఏరుదాట‌క బోడి మ‌ల్ల‌న్న అన్న‌ట్టు బీఆర్ఎస్ మంత్రి హ‌రీశ్ రావు మాట‌లు (Voice of BRS) ఉన్నాయ‌ని విమ‌ర్శించారు. నాయ‌కులు, క్యాడ‌ర్ లేని ఇప్పుడు అంటోన్న హ‌రీశ్ రావు మునుగోడులో క‌మ్యూనిస్ట్ ల మ‌ద్ధ‌తు ఎందుకు తీసుకున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇలాంటి ప‌రిణామం కాంగ్రెస్, క‌మ్యూనిస్ట్ ల‌ను క‌లిపేలా ఉంది.