Site icon HashtagU Telugu

Vivek Venkataswamy : తనకు టిక్కెట్ ముఖ్యం కాదు.. కేసీఆర్ సర్కారుపై పోరాడటమే ముఖ్యం -వివేక్

Vivek Congres Joins

Vivek Congres Joins

బిజెపి పార్టీ కి రాజీనామా చేసిన మాజీ MP వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy)..రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. తనకు టిక్కెట్ ముఖ్యం కాదు.. కేసీఆర్ సర్కారుపై పోరాడటమే ముఖ్యమని, తెలంగాణ ప్రజల ఆశలను బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందని వివేక్ అన్నారు. కేసీఆర్‌ కుటుంబం తమ కుటుంబ ఆకాంక్షల మేరకే పనిచేస్తోందని.. ప్రజా సంక్షేమం ఆ పార్టీకి పట్టడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దింపాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్‌లో చేరానని ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ తో వివేక్ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తమ ఆహ్వానం మేరకు ఆయన కాంగ్రెస్ లో చేరారని తెలిపారు. కీలకమైన సమయంలో కాంగ్రెస్ లోకి వచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలనే వివేక్ కాంగ్రెస్ లోకి వస్తున్నారని తెలిపారు. వివేక్‌ చేరికతో కాంగ్రెస్‌కు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం
ధీమా వ్యక్తం చేశారు.

అంతకు ముందు బిజెపి పార్టీ మేనిఫెస్టో కమిటీతో పాటు బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు అధికారిక ప్రకటన చేసారు వివేక్. ఈమేరకు రిజైన్ లెటర్ ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy)కి పంపించారు. భారమైన హృదయంతో నేను రాజీనామా చేస్తున్నాను..ఇంతకాలం పార్టీలో తనకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు అని చెబుతూ లేఖలో ప్రస్తావించారు.

We’re now on WhatsApp. Click to Join.

వివేక్ తన తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి 2009లో పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలిచి పార్లమెంట్ బొగ్గు మరియు ఉక్కు కమిటీల సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 2 జూన్‌ 2013న కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ (TRS) పార్టీలో చేరాడు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014 మార్చి 31న తిరిగి కాంగ్రెస్‌లో చేరాడు. ఆయన 2014లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత 2016లో టీఆర్‌ఎస్‌ లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితుడయ్యాడు.

2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి 25 మార్చి 2019న రాజీనామా చేసి బిజెపి లో చేరారు. అప్పటి నుండి నేటి వరకు బీజేపీలోనే కొనసాగుతూ వచ్చారు. ఇక ఇప్పుడు సొంత గూటికి చేరారు.

Read Also : Janta Ka Mood Survey : మరో సర్వే కూడా బిఆర్ఎస్ పార్టీకే జై కొట్టింది