Vivek – KCR : సీఎం కేసీఆర్‌కు కోటి అప్పు ఇచ్చిన వివేక్

Vivek - KCR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సమర్పించిన నామినేషన్ పత్రాలలో అభ్యర్థులకు సంబంధించిన ఆస్తులు, అప్పుల వివరాలన్నీ ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - November 13, 2023 / 09:25 AM IST

Vivek – KCR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సమర్పించిన నామినేషన్ పత్రాలలో అభ్యర్థులకు సంబంధించిన ఆస్తులు, అప్పుల వివరాలన్నీ ఉన్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ అఫిడవిట్‌ అనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థుల్లో ఈయనే అత్యంత ధనవంతుడు. మాజీ ఎంపీ వివేక్ ఆస్తి విలువ రూ.606.2 కోట్లు. సీఎం కేసీఆర్‌కు తాను రూ.కోటి అప్పుగా ఇచ్చానని అఫిడవిట్‌లో వివేక్ ప్రస్తావించడంపై అంతటా చర్చ జరుగుతోంది.  ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి మునుగోడు నుంచి పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా రూ.కోటిన్నర అప్పుగా ఇచ్చానని వివేక్ తన అఫిడవిట్‌లో పేర్కొనడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join.

రాజకీయంగా ఎంత ప్రత్యర్థులైనా.. ఒకరినొకరు దూషించుకున్నా.. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఒకరికొకరు సహాయం చేసుకోవటం ఆసక్తి రేపుతోంది. తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ కేసీఆర్.. వివేక్ వద్ద అప్పు చేయడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.అత్యంత ధనవంతులైన అభ్యర్థుల జాబితాలో టాప్ -20లో పది మంది కాంగ్రెస్ నేతలే ఉన్నారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ ఆస్తులు రూ.461.05 కోట్లు. మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆస్తులు రూ.458.39 కోట్లు. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ఆధారంగా.. రాష్ట్రంలో చాలా తక్కువ ఆస్తులున్న అభ్యర్థిగా బీజేపీ నేత బండి సంజయ్(Vivek – KCR) నిలిచారు.

Also Read: IT Raids : మంత్రి సబిత బంధువుల ఇళ్లు.. ఓ ఫార్మా కంపెనీపై ఐటీ రైడ్స్