Site icon HashtagU Telugu

Telangana Hospital: నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానాలో పాముల కలకలం!

Mgm

Mgm

తెలంగాణ ఆస్పతులు పాములకు నిలయంగా మారుతున్నాయా? పాముల సంచారంతో రోగులు భయడిపోతున్నారా? అంటే అవుననే అంటున్నారు రోగుల బంధువులు. తెలంగాణలోని వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రి లో రోగి బెడ్‌ కింద పాము కనిపించిన ఘటన సంచలనం రేపింది. ఆసుపత్రిలోని ఒక వార్డులో  రోగి బెడ్ పై పడుకున్నప్పుడు, ఓ పాము బెడ్  కింద పాకుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. భయాందోళనకు గురైన రోగులు, సిబ్బంది, అటెండర్లు అలర్ట్ అయ్యారు.

జర్నలిస్ట్ ఆశిష్ వీడియోను ట్వీట్ చేస్తూ.. ఒక నెలలో రెండవసారి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో (MGM) పాములు కనిపించాయి. తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఇది. ఎంజీఎం ఆస్పత్రిలో పాము కనిపించడం ఇది రెండోసారి. అక్టోబరు 13న ఒక పేషెంట్ అటెండర్ ఆసుపత్రి వాష్‌రూమ్‌లో నాగుపామును చూశాడు. ఈ ఏడాది మార్చిలో ఐసీయూలో ఉన్న రోగిని ఎలుకలు కొరికిన ఘటనతో ఆస్పత్రి వార్తల్లో నిలిచింది. రోగి శ్రీనివాస్ చేతులు, కాళ్లపై ఎలుకలు కొరికి రక్తం కారుతోంది. అతను శ్వాసకోశ, కిడ్నీ సంబంధిత సమస్యల కోసం అడ్మిట్ అయ్యాడు. ఈ ఘటనతో అతని పరిస్థితి విషమంగా మారింది. రెండు రోజుల తర్వాత శ్రీనివాస్ తీవ్ర అనారోగ్య సమస్యలతో మృతి చెందిన విషయం తెలిసిందే.

https://twitter.com/KP_Aashish/status/1584418978620792837?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1584418978620792837%7Ctwgr%5E7d25a09beaba1a1bca4419e6e5b28259dcd03b86%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fviral%2Fviral-video-snake-found-under-patients-bed-mgm-hospital-telangana-2nd-such-case-in-a-month-5703978%2F