Site icon HashtagU Telugu

Komatireddy Audio Leak: నా తమ్ముడికే ఓటెయ్యండి.. వెంకట్ రెడ్డి ‘ఆడియో లీక్’

Komatireddy Bro

Komatireddy Bro

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ బరిలోకి దింపుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. లీక్ అయిన ఆడియోలో.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.

కాంగ్రెస్ ఎంపీ నేతలతో మాట్లాడుతూ.. మనమంతా కుటుంబ సభ్యులలాంటి వారని, రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పని చేయాలని కోరినట్లు ఆడియోలో పేర్కొన్నారు. టీఎస్-పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపడతానని ఆయన వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తప్పు జరిగితే ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కోమటిరెడ్డి చెప్పడం గమనార్హం. ప్రస్తుతం కోమటిరెడ్డి ఆడియో మునుగోడు ఉప ఎన్నికలో తీవ్ర దుమారం రేపుతోంది.