Site icon HashtagU Telugu

Munugode Boycotted: ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు.. హామీ ఇస్తేనే ఓటింగ్ అంటూ!

Munugode

Munugode

మునుగోడు ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని కొందరు మహిళలు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా నియోజకవర్గంలోని గట్టుప్పల్ మండలం, రంగంతండా లో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించినట్లు తెలుస్తోంది. తమ గ్రామంలో మౌలిక వసతులు సరిగా లేవని, తమ సమస్యను చాలా సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకపోవడంతో నిరసన తెలిపారు.  స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఓటు వేయమంటూ హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో KTR తో ఫోన్లో మాట్లాడించారు టిఆర్ఎస్ నాయకులు. ‘‘మొదట పోలింగ్ లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోండి.. త్వరలోనే మీ సమస్య పరిష్కరిస్తామని హామీ’’ అంటూ కేటీఆర్ సర్దిచెప్పారు. అయితే ఓటును హక్కును వినియోగించుకున్నారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.

Exit mobile version