Mlc : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. మహిళ కోటలో ఎమ్మెల్సీ స్థానం కోసం ఎదురుచూస్తున్నారు విజయశాంతి, సునీత రావు. ఎమ్మెల్సీ ఆశావాహులు జాబితాలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హరకర వేణుగోపాల్, జీవన్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్, బండి సుధాకర్ గౌడ్, చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం జరగనుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. 4 ఎమ్మెల్సీ స్థానాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఆశావాహులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీలు కేటాయింపులు ఉంటాయి. నాలుగు స్థానాల్లో సీపీఐ ఒక స్థానాన్ని ఆశిస్తోంది.
Read Also: Dawood Ibrahim: రంగంలోకి దావూద్ గ్యాంగ్.. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ !
మరోవైపు ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ కానున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు అనే సస్పెన్స్‌కు తెరపడనుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.. ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. కాగా, తెలంగాణ ఎమ్మెల్సీల నామినేషన్లు దాఖలుకు ఈ నెల 10 చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే వడపోత ప్రక్రియ ప్రారంభించారు. పలువురి పేర్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 20న ఎమ్మెల్సీ ఎన్నికల జరుగుతున్న క్రమంలో ఖాళీ అయిన ఐదు స్థానాలలో నాలుగు కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. ఇక, నాలుగు సీట్లలో ఒకటి సీపీఐకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
Read Also: Jagdeep DhankarL : ఉపరాష్ట్రపతికి అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు