Vijayashanthi : రేవంత్ వర్సెస్ ఈటల.. ఇద్దరికీ ఇదే నా సలహా అంటూ మధ్యలో విజయశాంతి కామెంట్స్..

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. రేవంత్ రెడ్డిని, ఈటలను ఉద్దేశించి విజయశాంతి సూచనలు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Vijayashanthi suggestions to Etela Rajendra Reddy and Revanth Reddy

Vijayashanthi suggestions to Etela Rajendra Reddy and Revanth Reddy

ఇటీవల తెలంగాణ(Telangana) బీజేపీ(BJP) నేత ఈటల రాజేందర్(Etela Rajender) ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్(Congress) పై, రేవంత్ రెడ్డిపై(Revanth Reddy) తీవ్ర విమర్శలు చేశారు. మునుగోడు(Munugodu) ఎన్నికల్లో రేవంత్ బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకున్నాడని, కాంగ్రెస్ – బీఆర్ఎస్(BRS) కలిసి పనిచేస్తున్నాయని వ్యాఖ్యలు చేయడంతో దీనిపై రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు స్పందించి ఈటలపై ఫైర్ అయ్యారు.

దీంతో ఈ గొడవ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటూ సాగుతుంది. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. అయితే ఈ సమయంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. రేవంత్ రెడ్డిని, ఈటలను ఉద్దేశించి విజయశాంతి సూచనలు చేశారు.

తాజాగా ఈ వివాదంపై విజయశాంతి మాట్లాడుతూ.. నిరంతర తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం ఈ సందర్భంలో నా బాధ్యత. బీఆర్ఎస్ తో పోరాడే తమ్ముళ్లు రేవంత్, ఈటల తమ దాడిని ఒకరిపై ఒకరు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో అనిపిస్తుంది. ఈ సందర్భంలో కొంచెం ఆలోచించాలని తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న మీ ఇద్దరికీ చెప్పడం నా బాధ్యత అని తెలిపారు.

అలాగే.. దేశంలోనే అత్యంత ధన ప్రభావిత ఎన్నికల కార్యాచరణ తెలంగాణలో కొనసాగుతోంది. మన తెలంగాణ రాజకీయ కార్యకర్తలందరూ గత తొమ్మిది సంవత్సరాలుగా చూస్తున్న వాస్తవం ఇది. ఇందుకు కారణంగా ఉన్న అసలైన దుర్మార్గ వ్యవస్థపై పోరాడవలసిన కర్తవ్యం మనకు ఉంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాల నేతలు పరస్పరం చేసుకునే మాటల, సవాళ్ల దాడులు బీఆర్ఎస్ కు వేడుకలవుతున్నాయని గమనించాలి మీ ఇద్దరూ అని అన్నారు విజయశాంతి. దీంతో విజయశాంతి చేసిన వ్యాఖ్యలు అటు బీజేపీలోను, ఇటు కాంగ్రెస్ లోను చర్చగా మారాయి.

  Last Updated: 25 Apr 2023, 11:13 PM IST