Site icon HashtagU Telugu

Vijayashanti : కేసీఆర్ అవినీతే ఆయన ప్రభుత్వాన్ని కూలదోస్తుంది – విజయశాంతి

vijayashanthi

vijayashanthi

బిజెపి పార్టీ కి రాజీనామా చేసి.. కాంగ్రెస్ లో చేసిన విజయశాంతి (Vijayashanti) ఎన్నికల ప్రచారం (Telangana Election Campagin)లో దూకుడు కనపరుస్తుంది. బుధువారం జోగులాంబ గద్వాల్ జిల్లా అలాంపూర్‌ (Alampur)లో పర్యటించిన ఆమె కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు తిన్నారని ..కేసీఆర్ అవినీతే ఆయన ప్రభుత్వాన్ని కూలదోస్తుందన్నారు. తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌పై దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని , 420 గాళ్లతో బీజేపీ చేతులు కలిపిందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీని… రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించాలన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్ గెలిస్తే యావత్ తెలంగాణ గెలిచినట్టేనని విజయశాంతి అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించి దోపిడికి చరమగీతం పాడాలన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను మీకు అందిస్తుందని… మీరు మాత్రం కేవలం ఓటు వేసి మీ గ్యారెంటీని చాటుకోవాలని విజయశాంతి పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ జరగలేదని , కేసీఆర్ ప్రభుత్వం ఈ పదేళ్లు యువత, నిరుద్యోగులను మోసం చేసిందని .. తెలంగాణ ప్రజలపై దండయాత్ర చేసి నిరుపేదల భూములను కేసీఆర్ లాకున్నారని .. ప్రాజెక్టులు, ధరణి పోర్టల్, గ్రానైట్ బిజినెస్, డ్రగ్స్, మందు, గంజాయి సరఫరాతో దోపిడీ చేశారని విజయశాంతి పేర్కొన్నారు.

Read Also : Pawan Kalyan : తెలంగాణ స్ఫూర్తితో ఏపీలో రౌడీలతో పోరాడుతున్న – పవన్ కళ్యాణ్