చిత్రసీమలో అగ్ర హీరోల సరసన నటించి ఎంతో పేరు తెచ్చుకున్న విజయశాంతి (Vijayashanthi )..రాజకీయాల్లో (Politics) మాత్రం పెద్దగా రాణించలేకపోతుంది. నిత్యం పార్టీల మారుస్తూ..నిలకడలేని నేతగా పేరు తెచ్చుకుంటుంది. 1998 లో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఈమె..మొదట బీజేపీలో చేరారు. తదనంతర కాలంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో బీజేపీ నుంచి తప్పుకుని 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నాలుగేళ్లకు తన పార్టీని టీఆర్ఎస్ లో కలిపేశారు.
2009 ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి ఎంపీ అయ్యారు. కొన్ని ప్రతికూల పరిణామాలతో ఆమె టీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు. 2014లో కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి అక్కడా ఇమడలేకపోయారు. 2020లో మళ్లీ బీజేపీ గూటికే చేరి..నిన్నటి వరకు బిజెపి లో కొనసాగుతూ వచ్చారు. కానీ నేడు ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ లో చేరడం ఈమె రెండోసారి. అయితే విజయశాంతి పార్టీ మారడానికి కారణం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అనే తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
తనకంటే వెనుక పార్టీలోకి వచ్చిన ఈటల రాజేందర్ (Etela Rajender)కు అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై ఆమె తట్టుకోలేకపోయింది. అలాగే పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టిన తరువాత ఈటల తీరులో మార్పు వచ్చిందని ఆమె ఆగ్రహంగా ఉన్నారట. ఈటల రాజేందర్ తనను పట్టించుకోలేదని ఆమె పలువురి వద్ద చెప్పుకోండని అంటున్నారు. అందుకే ఆ మధ్య ఈటల రాజేందర్‌పై ట్విట్టర్‌లోనూ ఆమె పరోక్ష విమర్శలు చేసారని అంటున్నారు. చిట్ చాట్‌ల పేరుతో లీక్‌లు ఇస్తున్నారని ఈటలపై విమర్శలు గుప్పించారు. బండి సంజయ్‌పై ఈటల రాజేందర్ ఫిర్యాదు వ్యవహారం తర్వాత పార్టీ కి మరింత దూరం జరిగారు విజయశాంతి. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా ఆమె పార్టీని వీడుతారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం కాస్తా ఇప్పుడు నిజమైపోయింది. నేడు నవంబర్ 17న హైదరాబాద్‌లో ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఈమెకు ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతుంది.
Read Also : Rahul Pragathi Bhavan : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ‘ప్రగతి భవన్’ పేరును మారుస్తాం – రాహుల్