Vijayashanthi: కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి, కండువా కప్పిన ఖర్గే

సినీ నటి, మాజి బిజెపి నేత విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Published By: HashtagU Telugu Desk
Good Bye Vijayashanthi To Bjp.. What Is The Sign..

Good Bye Vijayashanthi To Bjp.. What Is The Sign..

Vijayashanthi: సినీ నటి, మాజి బిజెపి నేత విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో హైదరాబాదులో కాసేపటి క్రితం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను మల్లికార్జున ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల బీజేపీ పార్టీకి విజయశాంతి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఆమె ఇప్పటికే తన రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి పంపారు. కొంతకాలంగా విజయశాంతి బీజేపీ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తరుచుగా సోషల్ మీడియా వేదికగా బీజేపీ వైఖరిని ఎండగడుతూ వస్తున్నారు. బీజేపీలో కొన్ని రోజులుగా మౌనపాత్ర పోషిస్తున్నారు విజయశాంతి. హైకమాండ్ నిర్ణయాలు, అభిప్రాయాలు నచ్చక పార్టీ కార్యక్రమాలు, పొలిటికల్ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఎమ్మెల్యే టికెట్ల పంపిణీ పూర్తయ్యాక విజయశాంతి కాంగ్రెస్ లోకి వస్తున్నారు. మరి ఆమెకు లభించిన హామీ ఏంటి అనేది తేలాల్సి ఉంది. మెదక్ నుంచి ఆమె లోక్ సభకు కాంగ్రెస్ టికెట్ తో పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి విజయశాంతి సేవలను కాంగ్రెస్ ఏవిధంగా ఉపయోగించుబోతుందో వేచి చూడాల్సిందే.

  Last Updated: 17 Nov 2023, 05:56 PM IST