Site icon HashtagU Telugu

VijayaShanthi : విపక్షాల కూటమి పేరుపై విజయశాంతి ఫైర్.. వాళ్ళు ఓడిపోతే ఇండియా ఓటమి అని రాయాలా?

Vijayashanthi fires on Oppositions for naming INDIA for their Alliance

Vijayashanthi fires on Oppositions for naming INDIA for their Alliance

తాజాగా బీజేపీ(BJP)కి వ్యతిరేకంగా దాదాపు 24 పార్టీలు కలిసి బెంగుళూరులో విపక్షాల సమావేశం నిర్వహించగా సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతృత్వంలో ఈ మీటింగ్ జరిగింది. గతంలో కాంగ్రెస్ కూటమిని UPA అని పిలిచేవారు. ఇప్పుడు తమ కూటమిని INDIA (Indian National Developmental Inclusive Alliance) గా పేరు మార్చుకున్నారు. దీంతో బీజేపీతో పాటు అనేకమంది విమర్శలు చేస్తున్నారు. కావాలనే INDIA అని పెట్టుకున్నారని సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ వస్తున్నాయి.

ఇక ఈ ప్రతిపక్షాల మీటింగ్ పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా అనేకమంది ఇప్పటికే ఈ కూటమిపై మాట్లాడగా తాజాగా తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి(VijayaShanthi) విపక్షాల కూటమికి INDIA అని పేరు పెట్టడంపై ఫైర్ అయ్యారు.

విజయశాంతి తన సోషల్ మీడియాలో విపక్షాలపై.. ఓటములు ఎక్కువైతే, తెలివి ప్రమాదం అంచులు దాటి ఇలాంటి ఆలోచనలు వచ్చాయి కావచ్చు. రేపు ఈ కూటమి ఓడితే , ఇండియా ఓటమి అని రాయాల్నా…? అయినా దేశాన్ని స్ఫురింపచేసే ఇట్లాంటి పేర్లు పెట్టే ప్రయత్నాలు స్పష్టంగా ఖండించతగ్గవి. 26 పార్టీలు బెంగుళూరులో కలిసి పోరాడుతామన్నప్పుడు దళిత నేత మల్లిఖార్జున ఖర్గే గారి నేతృత్వమన్నా కనీసం ప్రకటిస్తారన్న అభిప్రాయం కొంత వినపడ్డది. కానీ కాంగ్రెస్ ప్రధాన పార్టీ కాదు, అక్కడ అందరూ ప్రధాన మంత్రి అభ్యర్ధులే అన్న ఉద్దేశం తెలుస్తుంది. కాంగ్రెస్ సహా 25 మిగత కాంగ్రెసేతర పార్టీలది కూడా అన్నట్లు సమావేశం జరిగింది. ఏమైనా గత UPA పేరు తీసివెయ్యటంలోనే కాంగ్రెస్ నేతృత్వ కూటమి వారిది కాదు అన్న సంకేతం తెలుస్తుంది అంటూ ఫైర్ అయింది.

 

Also Read : Telangana: ఫ్యాక్ట్-చెక్ పుస్తకం విడుదల చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి