Vijayashanthi – Election Campaign : ఖమ్మం, మహబూబాబాద్ లలో విజయశాంతి ప్రచారం..

ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్ శివారులోని నియోజకవర్గాల్లో విజయశాంతి ప్రచారం చేయనున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను ఖరారు చేసే పనిలో టీమ్ ఉంది

Published By: HashtagU Telugu Desk
Vijaya

Vijaya

బిజెపి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి (Vijayashanthi )..తన బాధ్యతను కొనసాగించడం మొదలుపెట్టింది. తెలంగాణ లో కేసీఆర్ (KCR) ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న విజయశాంతి..రీసెంట్ గా ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ (Congress) లో చేరారు. ఈ సందర్బంగా ఆమెకు పార్టీలో కీలక పదవి అందజేసింది అధిష్టానం. తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచార కమిటీని, ప్రణాళికా సంఘాన్ని నియమించగా… ఇందులో 15 మందికి కోఆర్డినేటర్‌ పోస్టులు ఇచ్చారు. విజయశాంతిని ప్రచార కమిటీ, ప్రణాళికా సంఘంలోకి తీసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, ప్లానింగ్ కమిటీ కన్వీనర్‌గా విజయశాంతి నియమితులయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. ప్రచారాన్ని సమన్వయం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జెట్ స్పీడ్‌లో సాగుతున్నదని విజయశాంతి అన్నారు. ప్రచారాన్ని సమన్వయం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 28వ తేదీ నాటికి పక్కా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్ శివారులోని నియోజకవర్గాల్లో విజయశాంతి ప్రచారం (Vijayashanthi – Election Campaign) చేయనున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను ఖరారు చేసే పనిలో టీమ్ ఉంది. త్వరలో ఆ షెడ్యూల్ ను విడుదల చేయనున్నారని అంటున్నారు.

Read Also : Telangana: ఇందిరాగాంధీ రాక్షస పాలన : కేసీఆర్

 

  Last Updated: 20 Nov 2023, 01:04 PM IST