Site icon HashtagU Telugu

Vijayashanthi : సోనియా అంటే తనకెంతో అభిమానమంటున్న విజయశాంతి

Vijayasanthi Talks About Sonia

Vijayasanthi Talks About Sonia

బిజెపి నేత విజయశాంతి తీరు ఎవ్వరికి అర్ధం కావడం లేదు..రీసెంట్ గా BRS MLC కవిత ఫై సానుభూతి తెలిపి అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liqour Scam) బీఆర్‌ఎస్‌ కవిత అరెస్ట్‌ను తాము కోరుకోవడం లేదని తెలిపారు.ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని , కవిత అరెస్ట్ కానంత మాత్రానా.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదన్నారు. అయితే బీఆర్‌ఎస్‌పై ఆ పార్టీ అధినేతపై విమర్శలు గుప్పించే విజయశాంతి ఒక్కసారిగా కవితకు ఈడీ నోటీసులపై కూల్‌గా రియాక్షన్ ఇవ్వడం రాజకీయాల్లో చర్చగా మారాయి. రెండు రోజులుగా ఈ అంశం గురించి మాట్లాడుకుంటుండగానే..తాజాగా సోనియా అంటే తనకెంతో అభిమానమని తెలిపి షాక్ ఇచ్చింది.

రాష్ట్రానికి వచ్చిన ఆమెను తెలంగాణ ప్రజలందరం తప్పక అభిమానిస్తామని , రాజకీయాలకు అతీతంగా ఆమెను గౌరవిస్తామని విజయశాంతి చెప్పుకొచ్చింది. నిన్నటి తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరి సభ (Tukkuguda Congress Vijayabheri Sabha )లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలను సమర్దిస్తున్నాని, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అవిభక్త కవలలు అని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని, నిన్న తుక్కుగూడలో రాహుల్ గాంధీ కూడా అదే చెప్పారని అన్నారు. మరో రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయశాంతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Read Also : TDP vs YCP : టీడీపీ మ‌ద్ద‌తుతోనే ఐటీ ఉద్యోగులు ఆందోళ‌నలు : వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి

ఇక నిన్న జరిగిన కాంగ్రెస్ సభలో సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించి ప్రజల్లో ఆనందం నింపింది. ఈ పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుంది. ఆ పధకాలు చూస్తే.. ప్ర‌తి మ‌హిళ‌కూ రూ.2500 చొప్పున ఆర్థిక సాయం , మ‌హిళ‌ల‌కు టీఎస్ ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి ఉచిత ప్ర‌యాణం , వంట గ్యాస్ సిలిండ‌ర్‌ను రూ.500కే ఇవ్వ‌డం, రైతులు, కౌలు రైతుల‌కు ఎక‌రాకు రూ.15000 చొప్పున ఆర్థిక సాయం, వ్య‌వ‌సాయ కార్మిక‌కుల‌కు రూ.12000 ఆర్థిక సాయం. క్వింటా ధాన్యం ఉత్ప‌త్తికి రూ.500 బోన‌స్‌(ఎంఎస్‌పీకి) , 5 ల‌క్ష‌ల మంది ఇళ్లులేని పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు , తెలంగాణ ఉద్య‌మ కారుల కుటుంబాల‌కు 250 గ‌జాల స్థ‌లాల పంపిణీ , గృహ జ్యోతి ప‌థ‌కం కింద 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్‌ , యువ‌వికాసం ప‌థ‌కం కింద విద్యా భ‌రోసా కార్డులు.. ప్ర‌తి విద్యార్థికీ రూ.5 ల‌క్ష‌ల సాయం , అన్ని మండ‌లాల్లోనూ అంత‌ర్జాతీయ స్థాయి పాఠ‌శాల‌ల నిర్మాణం , చేయూత ప‌థ‌కం కింద సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు నెల‌నెలా రూ.4 వేల పింఛ‌న్‌, రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆరోగ్య బీమా అందజేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.