Vietjet: బంపర్ ఆఫర్.. వియత్నం ఫ్లైట్ టికెట్ రేటు కేవలం 9 రూపాయిలే.. కాకపోతే!?

సాధారణంగా మనం ఏదైనా వెకేషన్ లకు వెళ్లాలి అంటే వేలు,లక్షలకు లక్షలు ఖర్చులు పెట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది.

Published By: HashtagU Telugu Desk
Vietnam Air Ticket

Vietnam Air Ticket

సాధారణంగా మనం ఏదైనా వెకేషన్ లకు వెళ్లాలి అంటే వేలు,లక్షలకు లక్షలు ఖర్చులు పెట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. అందులోనూ దూర ప్రయాణాలు అయితే లక్షలు ఖర్చులు చేయాల్సిందే. అయితే ఒకవేళ వెకేషన్ కోసం వియత్నం కి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం మీకు ఒక గుడ్ న్యూస్. Vietjet ఎయిర్‌ లైన్ మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇక ఈ ఆఫర్‌లో భాగంగా కేవలం రూ.9 కే వియత్నాంకి వెళ్లే విమాన టిక్కెట్‌ను ఆఫర్ చేస్తుంది.అయితే ఈ ఆఫర్‌లో భాగంగా 30 వేల ప్రమోషన్ టిక్కెట్లను అందుబాటులో ఉంచింది. కాగా ఈ ఆఫర్ కేవలం ఆగస్టు 15 నుంచి మార్చి 26 మధ్యలో ప్రయాణాలకు వర్తించనుంది.
17 రూట్లలో ఈ ఆఫర్ వాలిడ్‌లో ఉంటుంది.

దీనిలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ నుంచి వియత్నాంకి వెళ్లే నాలుగు సిటీలు వియత్నాం రాజధాని హనోయ్, హో చి మిన్హ్, డా నాంగ్, ఫూ క్వోక్ నగరాలు ఉన్నాయి. కాగా,Vietjet విమానయాన సంస్థ ప్రస్తుతం న్యూఢిల్లీ, ముంబై నుంచి హనోయ్, హో చి మిన్హ్ నగరాలను కలుపుతూ వారానికి నాలుగు విమానాల చొప్పున నడుపుతుంది. సెప్టెంబర్ 2022 నుంచి ఈ విమానాయాన సంస్థ అదనంగా 11 రూట్లలో కూడా తన విమానాలను నడపనుంది. అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు నుంచి హనోయ్, హో చి మిన్హ్, డా నాంగ్ నగరాలకు సెప్టెంబర్ నుంచి వారానికి నాలుగు విమానాల చొప్పున నడిపడం కోసం Vietjet సిద్ధమవుతోంది.

అయితే మరి ఈ అవకాశం పట్ల ఆసక్తి గల వారు Vietjet అధికారిక వెబ్‌సైట్‌లో https://www.vietjetair.com/en టిక్కెట్ లను బుక్ చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే ఈ నెల 17న హో చి మిన్హ్ నగరంలో ఇండియా వియత్నాం టూరిజం ప్రమోషన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్‌కు ఇరు దేశాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, ఇండస్ట్రీ ప్రతినిధులు హాజరయ్యారు. అయితే భారత్ నుంచి తమ దేశానికి వచ్చే టూరిస్ట్‌లను ఎలా ప్రమోట్ చేయాలనే విషయాలపై ఇరు దేశాలు చర్చించాయి. కాగా ఇరు దేశాలకు చెందిన 34 ట్రావెల్ కంపెనీలు ఈ చర్చల్లో పాల్గొని, వియత్నాం కు వచ్చే భారతీయుల సంఖ్యను కూడా ఎలా పెంచాలి అన్న విషయం పై తమ అభిప్రాయాలను తెలియజేశాయి.

  Last Updated: 27 Aug 2022, 10:04 AM IST