Site icon HashtagU Telugu

Viral Video: ఏనుగులతో సెల్ఫీకి యత్నం.. ఉరిమి తరిమేశాయి!!

Elephant Imresizer

Elephant Imresizer

కాదేదీ సెల్ఫీకి అనర్హం అన్నట్టుగా కొందరు ప్రవర్తించారు.ఏకంగా ఏనుగుల గుంపుతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం ఇద్దరు వ్యక్తులు నడి రోడ్డు మధ్యలో వాహనాలను ఆపారు. వాళ్ళు సెల్ఫీ కోసం ఆ ఏనుగుల గుంపు దగ్గరికి వెళ్లారు. వాళ్ళ వెధవ వేషాలు చూసి ఏనుగుల గుంపు కోపంతో ఊగిపోయింది. ఆ ఇద్దరిని తన్ని తరిమేసింది.

బతుకు జీవుడా.. అనుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళు బతికి బట్ట కట్టారు. పలాయనం చిత్తగించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. జంతువులతో సెల్ఫీలు ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు. ‘వన్యప్రాణులతో సెల్ఫీ మోజు ప్రాణాంతకం కావచ్చు. ఈ వ్యక్తులు అదృష్టవంతులు. సున్నితమైన ఏనుగుల గుంపు వారి ప్రవర్తనను క్షమించాయి. లేకపోతే శక్తివంతమైన అవి వారికి గుణపాఠం చెప్పడానికి పెద్దగా సమయం పట్టదు’ అని సుప్రియా పేర్కొన్నారు. అయితే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైలర్‌ అయ్యింది. ఇప్పటికే 63 వేలకుపైగా ఈ వీడియోను వీక్షించారు. నెటిజన్లు కూడా ఆ ఇద్దరు వ్యక్తుల తీరుపై మండిపడ్డారు.