తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే (Caste Census Survey) ప్రకటన అనంతరం అనేక చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (VH) తన నివాసంలో మున్నూరు కాపు నేతల సమావేశాన్ని (Munnuru Kapu Meeting) నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కూడా హాజరైనట్లు సమాచారం. దీనిపై పార్టీ హైకమాండ్ సీరియస్‌గా స్పందించిందని, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది. ఈ సమావేశంపై స్పందించిన వీహెచ్ “ఈ మీటింగ్‌లో ముఖ్యమంత్రిని గానీ, ప్రభుత్వాన్ని గానీ ఎవరూ తిట్టలేదు. కేవలం జనాభా లెక్క తక్కువగా నమోదైందన్న అభిప్రాయంతో సీఎంతో మాట్లాడతామన్నారు. అనంతరం మున్నూరు కాపు సభ తేదీ ఖరారు చేస్తాం” అంటూ వివరణ ఇచ్చారు. అయితే ఇది కేవలం సామాజిక న్యాయం కోసం చర్చే కాని, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కాదని ఆయన స్పష్టం చేశారు. కానీ బీసీ గణనపై ఇప్పటికే తీవ్ర అసంతృప్తి నెలకొన్న తరుణంలో వీహెచ్ కూడా బీసీ రాగం అందుకోవడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తుందనే భావన కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Virat Kohli Scripts History: 11 పరుగులు చేసిన తర్వాత కూడా చరిత్ర సృష్టించిన కోహ్లీ!
ఇప్పటికే తీన్మార్ మల్లన్న నిర్వహించిన బీసీ సభల ప్రభావం ప్రభుత్వంపై పడింది. ప్రజలు ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్టుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వీహెచ్ కూడా మున్నూరు కాపు సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం, కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త సమస్యగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మరో సీనియర్ నేత ఇదే మార్గాన్ని ఎంచుకోవడం పార్టీలో కలకలం రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో AICC క్రమంగా వీహెచ్‌పై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తలెత్తేలా ప్రతిపక్ష పార్టీలతో సమావేశాలు పెట్టడం హైకమాండ్‌కు నచ్చలేదని తెలుస్తోంది. కులగణన చేసిన ప్రభుత్వాన్ని అభినందించాల్సిన పార్టీ నేతలు, దాన్ని వ్యతిరేకించేలా సమావేశాలు పెట్టడాన్ని తప్పుబట్టినట్టు సమాచారం. ఈ ఘటనలు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను మరింత బహిర్గతం చేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
India vs New Zealand: టీమిండియా ఘన విజయం.. సెమీస్‌లో ఆసీస్‌తో ఢీ!