Congress : తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలబోతుందా..?

కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎంపీ వెంకటేష్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది

  • Written By:
  • Publish Date - April 17, 2024 / 12:47 PM IST

తెలంగాణ (Telangana) లో లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న వేళ అధికార పార్టీ కాంగ్రెస్ (Congress) కు షాక్ తగలబోతున్నట్లు తెలుస్తుంది. ఓ కీలక నేత పార్టీకి రాజీనామా చేసి , బిజెపి లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. గత కొద్దీ నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి గట్టిగా వీస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడం తో ఇతర పార్టీల నేతలంతా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ వస్తున్నారు. ఈ మధ్య అయితే మరి ఎక్కువయ్యారు. ముఖ్యంగా బిఆర్ఎస్ నుండి మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , కేసీఆర్ కు అత్యంత నమ్మకంగా ఉన్న వారు కాంగ్రెస్ లో చేరారు. ఈ చేరికలతో అన్ని చోట్ల కాంగ్రెస్ బలం పెరుగుతూ వస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలబోతుందని తెలుస్తుంది. రీసెంట్ గా కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎంపీ వెంకటేష్ (Venkatesh Netha) ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంకటేశ్ కు టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీపై గుర్రుగా ఉన్న ఆయన.. బీజేపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేసాడట..ఏ క్షణమైనా ఆయన బిజెపి లో చేరనున్నారని అంటున్నారు. ఇటు బీజేపీ ఇప్పటికే పెద్దపల్లి అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్‌ను ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు తనను బుజ్జగించి వెంకటేశ్ నేతకు బీజేపీ కండువా కప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ వెంకటేశ్ నేత బిజెపి లో చేరితే.. పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్‌లో బిజెపి దే విజయం అని అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Elephants Attack : తెలంగాణలోని ఆ జిల్లాలో ఏనుగుల దడ