ప్రముఖ హీరో వెంకటేష్ (Venkatesh )..ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని కలిసి అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి అధికారం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి..ప్రస్తుతం ప్రజలు కోరుకునే పాలన అందిస్తూ తన మార్క్ కనపరుస్తున్నారు. అధికారంలోకి వచ్చి రాగానే ఎన్నికల హామీలపై దృష్టి సారించడం..రెండు కీలక హామీలను అమలు చేయడం..వచ్చే నెలలో మరో రెండు హామీలను నెరవేర్చబోతున్నట్లు తెలుపడం..ఇవన్నీచూస్తూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె సీఎం గా భాద్యతలు చేపట్టిన దగ్గరి నుండి కూడా సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ని కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి , నాగార్జున , బాలకృష్ణ తదితరులు రేవంత్ కలిసి విషెష్ అందించగా..తాజాగా ఈరోజు ప్రముఖ హీరో వెంకటేష్ తో పాటు ఆయన సోదరుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు లు కలిసి రేవంత్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక వెంకటేష్ విషయానికి వస్తే..రీసెంట్ గా తన 75 వ చిత్రం Saindhav రీసెంట్ గా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ కూడా పెద్దగా అలరించలేకపోయింది. వచ్చే నెల మొదటి వారంలో ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతుంది.
Read Also : AAP vs BJP : ఒక్కొక్కరికి రూ.25 కోట్లు.. మా ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్ర : కేజ్రీవాల్