Venkatesh : ఖమ్మంలో రఘురాం రెడ్డి గెలుపు ఖాయం – హీరో వెంకటేష్

ఖమ్మం బైపాస్ రోడ్డులోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకుని.. సాయంత్రం 5 గంటలకు నగరంలోని మయూరి సెంటర్, పాత బస్టాండ్, జెడ్పీ సెంటర్ మీదుగా ఇల్లెందు క్రాస్ రోడ్డు వరకు రోడ్ షో నిర్వహించి, కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు

Published By: HashtagU Telugu Desk
Venky Kmm

Venky Kmm

సినీ హీరో వెంకటేష్ (Venkatesh) మంగళవారం ఖమ్మం (Khammam)లో సందడి చేసారు. లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామ సహాయం రఘురామిరెడ్డి (Khammam MP Ramasahayam Raghuram Reddy) కి మద్దతుగా వెంకటేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈవీఎంలో మూడో నెంబర్ గుర్తుందా.. అదేనండీ మన గుర్తు అంటూ.. తనదైనస్టయిల్ లో ప్రచారం చేసారు. అక్కడ భద్రాచలంలో శ్రీరాముడు ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు గెలుపు ఖాయమన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో మన RRRకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

రామసహాయం రఘురామ్ రెడ్డి కుమారునికి వెంకటేశ్ కుమార్తెనిచ్చి వివాహం చేసిన సంగతి తెలిసిందే. దీంతో వీరి మధ్య ఉన్న బంధుత్వం మేరకు ఈరోజు వియ్యంకుని కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇప్పటికే వెంకటేశ్ కుమార్తె తన మామ గారిని గెలిపించాలని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తుండగా నేడు వెంకటేష్ ప్రచారం చేసారు. ఖమ్మం బైపాస్ రోడ్డులోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి చేరుకుని.. సాయంత్రం 5 గంటలకు నగరంలోని మయూరి సెంటర్, పాత బస్టాండ్, జెడ్పీ సెంటర్ మీదుగా ఇల్లెందు క్రాస్ రోడ్డు వరకు రోడ్ షో నిర్వహించి, కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. ఈ రోడ్ షోకు పెద్ద ఎత్తున అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. వెంకటేష్ దారి పొడవున అభిమానులకు, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రామ సహాయం రఘురాం రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎక్కడ కూడా ప్రత్యర్థి పార్టీలపై ఎటువంటి విమర్శలు , ఆరోపణలు చేయలేదు..కేవలం వియ్యంకుడి విజయం కోసమే ఆయన ప్రచారం చేసినట్లు తెలుస్తుంది.

Read Also : Leg Injury : పవన్ కళ్యాణ్ కు గాయం చేసిన అభిమానులు

  Last Updated: 07 May 2024, 09:51 PM IST