Site icon HashtagU Telugu

Venkatesh : ఖమ్మం లో వెంకటేష్ ప్రచారం..ఫ్యామిలీ ఓట్లన్నీ ఆ అభ్యర్థికే అన్నమాట ..!!

Venki Camp

Venki Camp

ఫ్యామిలీ హీరో వెంకటేష్ (Venkatesh ) కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి (Congress MP Candidate)ని గెలిపించడం కోసం రంగంలోకి దిగబోతున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ జరుగగా..మే 13 న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ కి ఉప ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం బరిలో నిల్చున్న అభ్యర్థులంతా తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.

ఇక మొన్నటి వరకు ఎంతో ఉత్కంఠ రేపిన ఖమ్మం లోక్ సభ స్థానానికి గాను కాంగ్రెస్ పార్టీ నుండి రామ‌స‌హాయం రఘురాం రెడ్డి (Rama Sahayam Raghuram Reddy) బరిలోకి దిగారు. ఈ సీటును పొందాలని ఎంతోమంది భావించినా చివరికి మాత్రం రాఘురామి రెడ్డి కి దక్కింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మహబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి రఘురామి రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. బలమైన రాజకీయ పలుకుబడితో పాటు ఆర్థికంగా కూడా బలవంతుడు కావడంతో రఘురాం రెడ్డి వైపు కాంగ్రెస్ పార్టీ మొగ్గుచూపింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడే ఈ రఘురామి రెడ్డి.  ప్రముఖ తెలుగు హీరో విక్టరీ వెంకటేశ్ కూడా ఈయనకు వియ్యంకుడే.

We’re now on WhatsApp. Click to Join.

వెంకటేష్ కూతురు అశ్రుతను రఘురామా రెడ్డి కొడుక్కు ఇవ్వడం తో..ఇప్పుడు వియ్యకుడి గెలుపు కోసం వెంకటేష్ రంగంలోకి దిగబోతున్నారు. మే 07 న వెంకటేష్ రఘురామి రెడ్డి కోసం ప్రచారం చేయబోతున్నారు. ఇప్పటివరకు వెంకటేష్ స్వయంగా ఎన్నికల ప్రచారం చేసింది లేదు. ఫస్ట్ టైం ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఇక్కడే కాదు ఏపీలోని కైకలూరులో భార్య మేనమామ కామినేని శ్రీనివాస్ కోసం మరో రోజు వెంకటేష్ ప్రచారం చేయనున్నారు. వెంకీ కి ఫ్యామిలీ ఆడియన్స్ లలో ఏ రేంజ్ లో అభిమానులు ఉంటారో తెలియంది కాదు..తన నటనతో ఎంతోమందికి ఏడిపించారు కూడా..అలాంటి హీరో తనకు కావాల్సిన వారి కోసం ప్రచారం చేస్తుండడంతో అభిమానులు కూడా వారికే సపోర్ట్ ఇస్తారని అంత భావిస్తున్నారు. చూద్దాం వెంకీ ప్రచారం ఇరు పార్టీలకు ఎంత ప్లస్ అవుతాయో..!!

Exit mobile version