Elections 2024 : తెలంగాణ, ఏపీలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరెవరు ప్రముఖులు ఓటు వేశారో ఇప్పుడు చూద్దాం..
- భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓటేశారు.
- కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి హైదరాబాద్‌లోని బర్కత్‌పురాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- స్టార్ హీరో ఎన్టీఆర్ దంపతులు జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఓటు వేశారు.
We’re now on WhatsApp. Click to Join
- హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులు మాధవీలత, అసదుద్దీన్ ఒవైసీ కూడా తన ఓటు హక్కును ఉదయాన్నే వినియోగించుకున్నారు.
- సీఎం జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న జయమ్మ కాలనీ అంగన్వాడీ రెండో సెంటర్ 138వ బూత్‌లో జగన్ ఓటు హక్కును వినియోగించున్నారు. ఆయనతో పాటు ఆమె సతీమణి భారతీ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Also Read :Phase 4 Elections : 96 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ షురూ.. ఓటర్లకు ప్రధాని మోడీ సందేశం
- హైదరాబాద్‌లోని జూబ్లీ క్లబ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి, భార్య సురేఖ, కూతురు సుస్మిత.
- కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్న మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.
- ఎస్‌ఆర్ నగర్‌లోని ఆదర్శ పోలింగ్ బూత్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డితో కలిసి సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు