Venkaiah Naidu : రాజకీయ నేతలు పార్టీలు మారడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

సిద్ధాంతాలకు కట్టుబడి చేసే రాజకీయాల వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో ఫలవంతమైన చర్చలు జరిగి ప్రజలకు ఉపయోగపడే చట్టాలు రావాలన్నారు

Published By: HashtagU Telugu Desk
Venkaya Ket Comments

Venkaya Ket Comments

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం రాజకీయ నేతలు (Political Leaders Party Change) భుజం ఫై కండువా మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తున్నారని.. ఓ వ్యక్తి పార్టీ మారితే ఆ పార్టీలో ఉండగా వచ్చిన పదవికి సైతం రాజీనామా చేయాలంటూ వెంకయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. ఆదివారం హైదరాబాద్ (Hyderabad) ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన సిటిజన్‌ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, టీఎస్ ఎంఐడీసీ ఛైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్ సహా పలువురు ప్రమఖులు పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా వెంకయ్య (Venkaiah Naidu) మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి చేసే రాజకీయాల వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో ఫలవంతమైన చర్చలు జరిగి ప్రజలకు ఉపయోగపడే చట్టాలు రావాలన్నారు. యువత రాజకీయాల్లోకి రావటం ద్వారా భవిష్యత్తు తరాలకు మరింత ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు. నేటి సమాజంలో రాజకీయ నేతలు భుజంపై కండువా మార్చినంత ఈజీ గా పార్టీలు మారుస్తున్నారని..ఆలా పార్టీలు మారినప్పుడు ఆ పార్టీలో ఉండగా వచ్చిన పదవికి సైతం రాజీనామా చేయాలన్నారు.

Read Also : MLA Tatikonda Rajaiah : సొంత నియోజకవర్గంలో ఏంచేయాలన్న భయపడే పరిస్థితి – తాటికొండ రాజయ్య

  Last Updated: 08 Oct 2023, 04:31 PM IST