MLA Chennamaneni – Government Advisor : బీఆర్ఎస్ పార్టీ నుంచి వేములవాడ అసెంబ్లీ టికెట్ కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబుకు సీఎం కేసీఆర్ మరో అవకాశాన్ని కల్పించారు. వేములవాడ టికెట్ ను చల్మెడ లక్ష్మీనరసింహారావుకు కేటాయించడంతో నిరాశలో కూరుకుపోయిన చెన్నమనేనికి క్యాబినెట్ హోదా కలిగిన నామినేటెడ్ పదవిని కట్టబెట్టారు. రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా నియమించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఈ పదవిలో చెన్నమనేని ఐదేండ్లపాటు కొనసాగుతారు.
Also read : Saudi Arabia Students: సౌదీ అరేబియాలో పిల్లలు బడికి వెళ్లకుంటే.. తల్లిదండ్రులు జైలుకే..!
డాక్టర్ చెన్నమనేని రమేశ్ బాబు జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మక హంబోల్ట్ యునివర్సిటీ నుంచి ‘అగ్రికల్చర్ ఎకనామిక్స్’లో పరిశోధనలు చేసి పీహెచ్డీ పట్టాను పొందారు. అగ్రికల్చర్ ఎకానమీలో ఆయనకున్న పరిజ్జానాన్ని రాష్ట్ర రైతాంగం, వ్యవసాయాభివృద్ధి కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. గతంలో చెన్నమనేని రమేశ్ బాబు వేములవాడ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా (MLA Chennamaneni – Government Advisor) గెలిచారు. కాగా, రమేశ్ బాబుపై పౌరసత్వం వివాదం ఉండటం వల్లే ఈసారి టికెట్ ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.