Site icon HashtagU Telugu

Telangana: కేసిఆర్ ఏం తక్కువ చేసిండు పోచారం శ్రీనివాసరెడ్డి..?

Telangana

Telangana

Telangana: పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికను తీవ్రంగా ఖండించారు బాల్కొండ ఎమ్మెల్యే,మాజి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన పోచారం శ్రీనివాసరెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నిజమే కదా అని సమర్దిస్తుంటే, కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా చేర్చుకుంటారని, అవసరం లేకపోతే వదిలించుకోవడానికి వెనుకాడరని అంటున్నారు. మరి ప్రశాంత్ రెడ్డి ఏమన్నారో చూద్దాం.

“కేసిఆర్ ఏం తక్కువ చేసిండు పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డికి, కేసిఆర్ మిమ్మల్ని ఎప్పుడూ లక్ష్మీ పుత్రుడనీ సంబోధిస్తూ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మిమ్మల్ని ఎప్పుడూ పెద్దలు శ్రీనివాస రెడ్డి అంటూ ముందు వరుసలోనే ఆయన పక్కనే కూర్చుండబెట్టుకునే వారు. మిమ్మల్ని మాకు ఆదర్శంగా చూపిస్తూ మీ గురించి గొప్పగా చెప్పేవారు. వ్యవసాయ మంత్రిగా,శాసనసభాపతిగా మీకు సమున్నత స్థానం కల్పించారు. బాన్సువాడ అభివృద్ధికి మీరు అడిగినన్ని నిధులిచ్చారు. రోడ్లకు,చెక్ డ్యాంలకు,ప్రాజెక్టు లకు,డబుల్ బెడ్రూం ఇళ్లకు,ఇతర అభివృద్ధి పనులకు కాదనకుండా నిధులిచ్చారు. సిఎం డెవలప్మెంట్ నిధుల నుండి అత్యధికంగా తీసుకున్నది మీరే. నేను హౌసింగ్ మినిస్టర్ గా ఉన్నా..నా కంటే ఎక్కువ మీకు బాన్సువాడకు అడిగినన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారు. ఇదంతా కేవలం కేసిఆర్ గారు మీకు ఇచ్చిన ప్రాధాన్యత వల్లే కదా..! మీరు అత్యంత ఇష్టదైవంగా భావించే తెలంగాణ తిరుమల గుడికి కూడా అడిగినన్ని నిధులు ఇచ్చారు. ప్రాణం పోయే వరకు కేసిఆర్ గారి వెంటే ఉంటానని అన్నారు. పార్టీ కష్ట సమయంలో కేసిఆర్ గారిని వదిలి వెళ్లి మీరు ఇష్టంగా కొలిచే ఆ తెలంగాణ తిరుమల శ్రీనివాసుడికి ఏం సమాధానం చెప్తారు పోచారం గారు అంటూ సూటిగా ప్రశ్నించారు.

అధికారం,పదవులు లేకుంటే బ్రతకలేమా..ఈ వయసులో పార్టీ మారడం మీకు భావ్యమా..?, పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో కేసిఆర్ గారికి వెన్నుపోటు పొడిచి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం అత్యంత బాధాకరం,దురదృష్టకరం..బాన్సువాడ ప్రజలే దీనిపై ఆలోచన చేయాలని విజ్ఞప్తి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాల్కొండ ఎమ్మెల్యే,మాజి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

Also Read: Mahipal Reddy: ఈడీ సంచలనం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే 300 కోట్ల అక్రమాలు