Site icon HashtagU Telugu

Vehicle Scrapping : జనవరి నుండి తెలంగాణ లో వాహన తుక్కు (స్క్రాపింగ్) విధానం అమలు

Vehicle Scrapping

Vehicle Scrapping

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) పర్యావరణ పరిరక్షణలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాలం చెల్లిన వాహనాలను తొలగించేందుకు 2025 జనవరి 1వ తేదీ నుంచి వెహికల్ స్క్రాపింగ్ (Vehicle Scrapping) విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానం ప్రకారం.. వాహనదారులు తమ కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ చేస్తే వారికి సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా కొత్త వాహనం కొనుగోలులో రాయితీ పొందవచ్చు. పాత వాహనాల వల్ల కార్బన్ ఉద్గారాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎకో ఫ్రెండ్లీ వాహనాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక, పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి నగర శివారుల్లోని శంషాబాద్, నందిగామ, తూప్రాన్ ప్రాంతాల్లో స్క్రాపింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈ రంగంలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఈ విధానం వల్ల కాలుష్యం తగ్గడంతోపాటు రోడ్డు ప్రమాదాలను కూడా నియంత్రించవచ్చని రవాణాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

వెహికల్ స్క్రాపింగ్ అనేది కాలం చెల్లిన లేదా మరమ్మత్తులకు మించి దెబ్బతిన్న వాహనాలను తొలగించి, వాటి భాగాలను పునర్వినియోగం లేదా రీసైక్లింగ్ చేయడం. ఈ విధానం పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించడంతోపాటు కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ విధానం వల్ల పాత వాహనాల నిర్వహణ, రోడ్డు భద్రత, పర్యావరణ పరిరక్షణలో సానుకూల మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read Also : Childrens Day 2024 : బాలల దినోత్సవాన్ని నవంబరు 14నే ఎందుకు నిర్వహిస్తారంటే..