తెలంగాణ సర్కార్ (Telangana Govt) వాహన కొనుగోలు దారులకు తీపి కబురు అందించబోతుంది. ఇక ఫై వాహనం కొనుగోలు చేసిన షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్లు (Vehicle Registration) చేసేందుకు రవాణా శాఖ చూస్తుంది. ఇప్పటీకే ఏపీలో ఇది అమలు చేసి సక్సెస్ కావడంతో..ఇప్పుడు తెలంగాణ లో కూడా పద్దతిని అమలు చేయాలనీ చూస్తుంది. ఇప్పటి వరకు వాహనం కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వచ్చి తమ వాహన రిజిస్ట్రేషన్ ను చేసుకునే వారు. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరిగితే కానీ పని కావడం లేదు..అంతే కాకుండా మధ్యలో బ్రోకర్లు కూడా ఎక్కువ అవ్వడం తో వారికీ కూడా డబ్బులు ఇచ్చి పని చేయించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తెలంగాణ రవాణాశాఖ..ఇక ఫై రిజిస్ట్రేషన్లు షోరూంలలోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే దీనికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్‌లోని వాహనాల షోరూంల వివరాలతోపాటు నిత్యం నమోదయ్యే వాహనాల వివరాలను సేకరిస్తోంది. ఒక్కో డీలర్ విక్రయించే వాహనాల సంఖ్య, షోరూంలలోనే వాహనాల శాశ్వత నమోదు ప్రక్రియ చేపడితే అవసరమయ్యే టెక్నలాజి తదితర అంశాలపై కసరత్తు చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం షోరూంలలో వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్) చేస్తున్నారు. రవాణాశాఖ నుంచే ఈ టీఆర్‌లు అందుతున్నప్పటికీ అందుకోసం వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లట్లేదు. వాహనంతోపాటు షోరూంలోనే టీఆర్ పత్రాలను తీసుకుంటున్నారు. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) కూడా షోరూంలకే బదిలీ అయితే వాహనదారులకు ఇకపై పీఆర్ స్మార్ట్ కార్డులు చేతికి అందుతాయి.
Read Also ; Venkaiah Naidu: నేతలు పార్టీలు మారడం..డిస్ట్రబింగ్ ట్రెండ్ః వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు