Site icon HashtagU Telugu

Free..Free : పెద్దపల్లి మార్కెట్ లో ఫ్రీగా కూరగాయలు..ఎగబడ్డ జనం

Vegetable Free

Vegetable Free

ప్రస్తుతం కూరగాయల ధరలు (Vegetable Prices) ఎంతమండిపోతున్నాయో తెలియంది కాదు..ఏది కొనాలన్నా కేజీ రూ. 80 లకు తక్కువ లేవు. దీంతో సామాన్య తరగతి ప్రజలు కేజీ దగ్గర పావుకేజీ కొనుగోలు చేసి పొటగడుపుతున్నారు. కూరగాయల ధరలు తగ్గితే బాగుండు అని అంత మాట్లాడుకుంటున్న క్రమంలో పెద్దపల్లి జిల్లాలో ఫ్రీ గా కూరగాయలు ఇస్తున్నారని తెలిసి పోటెత్తారు. మరి ఎందుకు ఫ్రీ గా ఇస్తున్నారంటే..

We’re now on WhatsApp. Click to Join.

గత కొద్దీ రోజులుగా పెద్దపల్లిలో కూరగాయల మార్కెట్లో హోల్‌సేల్‌‌(Whole sale), రిటైల్ (Retail traders )కూరగాయలు వ్యాపారస్తుల మధ్య వివాదం నడుస్తుంది. హోల్‌సేల్‌‌ వ్యాపారులు వినియోగదారులకు రిటైల్‌గా అమ్మడంతో మేము తీవ్రంగా నష్టపోతున్నామని రిటైల్ వ్యాపారస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం హోల్ సేల్ వ్యాపారులు రిటైల్ గా కూరగాయలు అమ్మ వద్దని ఉండగా వారు నిబంధనలు అతిక్రమించి కిలోల చొప్పున కూరగాయలు రోజు మొత్తం అమ్ముతుండడంతో రిటెయిల్ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ. మంగళవారం ఏకంగా కూరగాయలన్నీ ఫ్రీగా పంచిపెట్టారు. ఈ విషయం తెలిసి కూరగాయల కోసం జనం ఎగబడ్డారు.

Read Also : Women’s T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా తుది జట్టు