Veena & Vani: ఇంటర్ ఫలితాల్లో వీణ-వాణీ జయకేతనం!

వాళ్లిద్దరు అవిభక్త కవలలు.. పుట్టుకతోనే కలిసిపోయిన వాళ్ల శరీరాలను విడదీసేందుకు డాక్టర్లు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.

Published By: HashtagU Telugu Desk
Veena And Vani

Veena And Vani

వాళ్లిద్దరు అవిభక్త కవలలు.. పుట్టుకతోనే కలిసిపోయిన వాళ్ల శరీరాలను విడదీసేందుకు డాక్టర్లు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అయ్యో అని చాలామంది జాలీ చూపారు. కానీ అవిభక్త కవలలు తమ బాధలను మరిచిపోయి బతకడం నేర్చుకున్నారు. ఇతర పిల్లల మాదిరిగా ఆడుకోవడం, చదువుకోవడం మొదలుపెట్టారు. ఫలితంగా పది, ఇంటర్ తరగతుల్లో మంచి మార్కులు సాధించి శభాష్ అనిపించుకున్నారు. వాళ్లిద్దరే వాణి, వీణ.

ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ప్రకటించిన ఫలితాల్లో వీణ 712 మార్కులు సాధించగా, వాణి 707 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా కవలను గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. వారి ఉన్నత విద్యకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. వీణా, వాణిలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆమె తెలిపారు. వీరిద్దరూ ఇంటర్మీడియట్ పరీక్షలు స్వయంగా రాశారని పేర్కొనడం విశేషం. 10వ తరగతిలో వీణ 9.3 జీపీఏ సాధించగా, వాణి 9.2 జీపీఏ సాధించింది. 2022 ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను మంగళవారం తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

  Last Updated: 28 Jun 2022, 06:01 PM IST