తెలంగాణ (Telangana) లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో వలసల పర్వం రోజు రోజుకు ఎక్కువైపోతోంది. ముఖ్యంగా అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) ను పెద్ద ఎత్తున నేతలు వీడుతున్నారు. కొంతమంది టికెట్ రాలేదని పార్టీ నుండి బయటకు వస్తుంటే..మరికొంతమంది పార్టీ నేతల ఫై ఆగ్రహంతో బయటకు వస్తున్నారు. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadeesh Reddy) కీలక అనుచరుడు..బీసీ నేత వట్టె జానయ్య కుటుంబం (Vatte Janaiah Family)..బిఆర్ఎస్ ను వీడి బీఎస్పీ పార్టీ లో చేరారు. జానయ్య భార్య రేణుక (Vatte Renuka), తల్లిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ (BSP Praveen).
2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన జానాయ్య యాదవ్ గతంలో గాంధీనగర్ సర్పంచ్ గా, సూర్యాపేట రూరల్ మండలం ఎంపీపీగా పనిచేశారు. ఆయన భార్య అధికార బీఆర్ఎస్ నుంచి సూర్యాపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా కూఉన్నారు. ఆయన బీఆర్ఎస్ నుంచే ఉమ్మడి నల్లగొండ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ గా కూడా ఉన్నారు. ఈ విషయంలో జానాయ్యకు సహకరించి పదవి ఇప్పించింది కూడా మంత్రి జగదీష్ రెడ్డి. కానీ గత కొద్దీ నెలలుగా జగదీష్ రెడ్డి కి జానయ్య కు మధ్య అభిప్రాయ విభేదాలు వచ్చాయి.
ఆ మధ్య జానయ్య బీసీ వాదాన్ని తలకెత్తుకున్నారు. టికెట్ల విషయంలోనూ బీసీ జనాభా మేరకు కేటాయింపులు ఉండాలన్న వాదన వినించారు. విద్యార్థి దశలో వామపక్ష విద్యార్ధి సంఘాల్లో, ఉద్యమాల్లో పాల్గొన్న జానయ్య రాజకీయ చైనత్యంతో మాట్లాడుతుండడం బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన నింపాయి. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని జానయ్య తన దగ్గరి సహరులతో మాట్లాడడం.. మంత్రి.. ఆయనను దూరం పెట్టడానికి కారణమైంది. ఆ తర్వాత జానయ్య ఫై జగదీశ్ పలు కేసులు పెట్టడం తో మరింత వైరం పెరిగింది. ఇదే క్రమంలో వట్టె జానయ్య యాదవ్ కు బీఎస్పీ అండగా నిలబడింది. తమ పార్టీ తరపున ఈ సారి సూర్యాపేట నుంచి గెలిపించుకుంటామని బీఎస్సీ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. జానయ్య కుటుంబాన్ని కలిసి మద్దుతగా నిలిచారు. ఈ క్రమంలో నేడు బిఆర్ఎస్ ను వీడి జానయ్య ఫ్యామిలీ..బీఎస్పీ లో చేరారు. ఈ సందర్బంగా ప్రవీణ్ మాట్లాడుతూ…రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ నుండి జానయ్య పోటీ చేయబోతున్నారని..ఆయన గెలుపు ఖాయమని ప్రవీణ్ ధీమా వ్యక్తం చేసారు. జానయ్య ను గెలిపించి మళ్ళీ పార్టీ ఆఫిసుకు తీసుకొస్తాం అన్నారు. బహుజనలు, మైనారిటీలు ఏకం అవ్వాలి..బహుజన రాజ్యం రావాలి..వచ్చే ఎన్నికల్లో నా భర్తను అసెంబ్లీ కి పంపిస్తా..జగదీశ్వర్ రెడ్డి ని అసెంబ్లీ గేటు తొక్కకుండా చేస్తా..అంటూ
జగదీశ్వర్ రెడ్డి కి వట్టే రేణుక సవాల్ విసిరింది.
Read Also : CM Candidate : సీఎం ఎవరైనా.. కార్యకర్తలకు బెడ్ రూమ్ లోకి వెళ్లేంత స్వేచ్ఛ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి