Site icon HashtagU Telugu

Secretariat Vastu : రూ.3 కోట్లతో తెలంగాణ సచివాలయంలో చేస్తున్న వాస్తు మార్పులివీ..

Vastu Changes In Telangana Secretariat

Secretariat Vastu : ‘వాస్తు’ అనేది ప్రతీ భవనానికి చాలా కీలకం. చాలామందికి వాస్తు సెంటిమెంట్ ఉంటుంది. అటువంటి వారు తాము నివసించే చోటును, పనిచేసే చోటును వాస్తు శాస్త్రానికి అనుగుణంగా మార్చుకుంటారు. ఇప్పుడు ఇదే విధమైన వాస్తు మార్పులు తెలంగాణ సచివాలయంలోనూ జరుగుతున్నాయి. ఆ వివరాలను ఈ వార్తలో చూద్దాం..

Also Read :Masked Burglars : బ్రిటన్‌ రాజ భవనంలోకి ముసుగు దొంగలు.. ఏమేం ఎత్తుకెళ్లారంటే..

తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులకు సంబంధించిన పనులను దాదాపు రూ.3 కోట్ల 20 లక్షల వ్యయంతో చేస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.  వాటి ప్రకారం.. సచివాలయం ప్రధాన గేట్లు, రోడ్లలో మార్పులు జరుగుతున్నాయి. సచివాలయంలో తూర్పు వైపున ఉన్న ప్రధాన ద్వారాన్ని  బాహుబలి గేటు అని పిలుస్తారు. ఆ ప్రధాన ద్వారం తలుపులను ఆదివారం తొలగించారు. సచివాలయంలోని ఈశాన్యం దిక్కులో ఉన్న గేటుకు తూర్పు వైపున ప్రధాన ద్వారాన్ని(Secretariat Vastu) ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఆ భాగంలోని ఇనుప గ్రిల్స్‌ను తీసేశారు. వాటి ప్లేసులో ప్రధాన ద్వారం ఏర్పాటవుతుంది. డిసెంబరు 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఆలోగా వాస్తు మార్పులకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు.

Also Read :Super Biker : సూపర్ బైకర్ నవీన్.. కృత్రిమ కాలితో ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతానికి

తెలంగాణ సెక్రటేరియట్‌‌కు ప్రస్తుతం నాలుగు వైపులా ప్రధాన గేట్లు ఉన్నాయి. తూర్పు వైపు లుంబినీ పార్క్‌కు ఎదురుగా బాహుబలి గేటు ఉండేది. ఆ గేటు నుంచి సచివాలయం లోపల ప్రధాన ద్వారం వరకు ఉన్న మార్గంలోనే తెలంగాణ తల్లి విగ్రహం, దాని చుట్టూ లాన్, ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. అందుకే గత కొంతకాలంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇప్పుడు ఈ మార్గంలోనే నైరుతి, ఈశాన్య గేట్లను కలుపుతూ రోడ్డును నిర్మిస్తున్నారు.ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ అధికారులు ప్రస్తుతం ఈశాన్యం వైపున ఉన్న గేటును రాకపోకల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ గేటు పక్కనే మరో గేటును నిర్మించనున్నారు. ఒక గేటు నుంచి లోపలికి, మరో గేటు నుంచి బయటికి వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నారు. తెలంగాణ సచివాలయాన్ని గత బీఆర్ఎస్ హయాంలో 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 2023 సంవత్సరం ఏప్రిల్ 30న దీన్ని కేసీఆర్ ప్రారంభించారు.

Exit mobile version