హైదరాబాద్ (Hyderabad) హఫీజ్ పేట (Hafiz Peta)లో హైడ్రా (Hydraa) అధికారులు చేపట్టిన కూల్చివేతలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. 17 ఎకరాల భూమిలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్న హైడ్రా బృందం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (TDP MLA Vasantha Krishna Prasad)కు చెందిన కార్యాలయాన్ని కూడా కూల్చేసింది. ఈ భూమిలో విల్లు షెడ్లు, సినిమా పరికరాల నిల్వగదులు ఉండగా, వాటిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ భూముల విలువ రూ. 2 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. హైడ్రా చర్యలపై వసంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Underworld Don: అండర్ వరల్డ్ డాన్ కుమారుడిపై కాల్పులు.. ముత్తప్ప రాయ్ ఎవరు ?
ఈ భూమిని 2005లోనే కొనుగోలు చేశామని, అప్పట్లో రంగారెడ్డి కలెక్టర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా పొందినట్లు వసంత పేర్కొన్నారు. భూమిపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే హైడ్రా అధికారులను కలిసి సంబంధిత పత్రాలు సమర్పించామని చెప్పారు. అర్బన్ సీలింగ్ యాక్ట్ కింద జరిమానా చెల్లించి భూమిని క్రమబద్ధీకరించుకున్నామని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసిన 20 సంవత్సరాల నుంచి తమకు ఎలాంటి వివాదాలు లేవని, ఆ భూమి వంశపారంపర్యంగా తమదేనని స్పష్టం చేశారు. అత్యవసరమైన డాక్యుమెంట్లతో కూడిన కార్యాలయాన్ని ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం బాధాకరమన్నారు.
Samantha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత.. టీటీడీ డిక్లరేషన్‌పై సంతకం, వీడియో వైరల్!
హైడ్రా కోర్టు సెలవు రోజునే కూల్చివేతలు జరిపిందని వసంత మండిపడ్డారు. ఇది తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆయనను కలిసి న్యాయం కోరతానని అన్నారు. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి నిజాన్ని వెలుగులోకి తేవాలన్నారు. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం హఫీజ్ పేట సర్వే నెంబర్ 79/1 పూర్తిగా ప్రభుత్వ భూమేనని, ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు ఉన్నా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదం మరింత రాజకీయ మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి.