Varahi Yatra in Telangana : తెలంగాణలో పవన్ ‘వారాహి యాత్ర ‘..

ఈ 32 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేయనున్నట్లు

  • Written By:
  • Updated On - October 10, 2023 / 11:54 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలంగాణ లో వారాహి యాత్ర (Varahi Yatra in Telangana) చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. తెలంగాణాలో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. నవంబర్ 30 న రాష్ట్ర వ్యాప్తంగా 119 స్థానాలకు గాను అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Election 2023) జరగబోతున్నాయి. దీని తాలూకా షెడ్యూల్ ను సోమవారం ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార పార్టీ తో పాటు అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి.

ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ (Janasena Party) కూడా రాష్ట్ర వ్యాప్తంగా 32 స్థానాలకు గాను పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన చేసారు. ఈ 32 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజవర్గంలో (Adilabad Khanapur Constituency) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ నాయకుడు డా. ధారావత్ నరేంద్ర నాయక్ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

సోమవారం అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో డా. ధారావత్ నరేంద్ర నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉంటుందని తెలిపారు. త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “వారాహి యాత్ర” ఖానాపూర్ నియోజకవర్గానికి రానున్నట్లు స్పష్టం చేసారు. యాత్రలో భాగంగా ఆదివాసీల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబాను పవన్ కళ్యాణ్ దర్శించుకుంటారని, ఆపై నియోకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకుంటారని తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయ్యాయని ధారావత్ నరేంద్ర నాయక్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆదిలాబాద్ ఎంపీగా గెలిచిన సోయం బాపురావ్ ఆదిలాబాద్ జిల్లాకు ఏం న్యాయం చేశారని మండిపడ్డారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ములుగు జిల్లాకు కేటాయిస్తే ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన బిడ్డలు బాగుపడాలని లేదా అని ప్రశ్నించారు. మరి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఎప్పుడు మొదలుపెడతారనేది చూడాలి.

Read Also : Chandrababu Neeru Chettu Scheme : ‘నీరు-చెట్టు’ కార్యక్రమంలో వేలకోట్లు చేతులు మారాయంటూ వైసీపీ ఆరోపణ