Site icon HashtagU Telugu

Vanpic Case: నిమ్మగడ్డకు రిలీఫ్‌… వాన్‌పిక్‌పై ఛార్జ్‌షీట్ రద్దు చేసిన హైకోర్టు

తెలంగాణ హైకోర్టులో వాన్పిక్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌కు భారీ ఊరటలబించింది. పెట్టబడుల విషయంలో సిబిఐ దాఖలు చేసిన అభియోగాలను రద్దు చేయాలన్న క్వాష్ పిటిషన్ ను హైకోర్టు అనుతించింది. నిమ్మగడ్డ ప్రసాద్, వాన్పిక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌లపై హైకోర్టు విచారణ జరిపింది.

సిబిఐ దాఖలుచేసిన అభియోగాలను రద్దు చేయాలని నిందితుల జాబితానుండి తొలగించాలని క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. సిబిఐ చేస్తున్న అభియోగాలు వాస్తవం కాదని కోర్టుకు తెలిపారు న్యాయవాదులు. యుపిఏ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసులని కోర్టుకు నివేదించారు.

రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సిబిఐ కేసులు నమోదుచేసిందని ,దీనిపై దశాబ్ద కాలంగా కోర్టులను ఆశ్రయిస్తున్నామని కోర్టు దృష్టికి తెచ్చారు. సిబిఐ కచ్చిమైన ఆధారాలు లేకుండా సందర్భోచితంగా ఊహాజనితమైన వాదనలు చేస్తుందంని కంపెనీ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

ఎలాంటి డాక్యుమెంటరీ ఆధారాలు లేకుండా వాస్తవాలను వక్రీకరిస్తు తప్పుగా చూపడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్ట్ నేరపూరిత కుట్రగా సిబిఐ అభివర్ణించడంలో వాస్తవం లేదన్నారు. భూ కేటాయింపుల వెనుక క్విడ్ ప్రోకో జరిగిందన్న సిబిఐ వాదనలు వాస్తవం కాదన్నారు. రస్‌ఆల్ ఖైమాతో ఒప్పందం వెనుక ప్రభుత్వం పెద్దలు,వాన్పిక్ స్వప్రయోజనాలు ఉన్నాయంటూ సిబిఐ వాదన నిజం కాదన్నారు. సిబిఐ చార్జిషీట్‌లోని అభియోగాలు, వాన్పిక్ న్యాయవాదుల వాదనలపై విచారణ జరిపిన న్యాయస్థానం క్వాష్ పిటిషన్ పై కీలక తీర్పును వెల్లడించింది. కంపెనీపై క్రిమినల్ కేసును కొనసాగించడం చట్ట వ్యతిరేకమని కోర్టు అభిప్రాయం వ్యక్తంచేసింది. సెక్షన్482 సిఆర్పిసీలోని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వాన్పిక్‌పై క్రిమినల్ ప్రొసీడింగ్‌నూ నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేసింది. సిబిఐ దాఖలుచేసిన చార్జిషీట్‌ను రద్దు చేసింది.