Site icon HashtagU Telugu

Palvancha Incident:  వనమా రాఘవ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్!

Template (47) Copy

Template (47) Copy

పాల్వంచ‌లో సంచ‌ల‌నం సృష్టించిన రామ‌కృష్ణ కుటుంబం సుసైడ్ కేసులో కొత్త‌గూడెం ఎమ్మెల్యే కుమారుడు వ‌న‌మా రాఘ‌వ‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘ‌ట‌న జ‌రిగి వారం రోజుల త‌రువాత పోలీసులు రాఘ‌వ‌ను ద‌మ్మ‌పేట ద‌గ్గ‌ర అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో ఈ నెల 3న మండిగ నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వ‌న‌మా రాఘ‌వ‌ ఏ2గా ఉన్నారు. రాఘవ బెదిరింపుల కారణంగానే తన భార్య, ఇద్దరు పిల్లలపై పెట్రోలు పోసి నిప్పంటించి తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న‌ట్లు రామ‌కృష్ణ సెల్ఫీ వీడియో బ‌య‌ట‌క‌కు వ‌చ్చింది. దీంతో వ‌న‌మా రాఘ‌వ చుట్టు ఉచ్చు బిగిసింది. ప్ర‌తిప‌క్ష పార్టీలు, రామ‌కృష్ణ కుటుంబం ఆందోళ‌న‌ల‌తో పోలీసులు ఎట్ట‌కేల‌కు రాఘ‌వను అరెస్ట్ చేసి శ‌నివారం కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌నున్నారు. రాఘ‌వ‌తో పాటు ఆయ‌న పీఏ, కార్ డ్రైవ‌ర్ ను అరెస్ట్ చేశారు. రాఘ‌వ కారులో పోలీసులు తెల్ల‌వారుజామున త‌నిఖీలు చేయ‌గా.. రెండు సెల్ ఫోన్లు, ప‌లు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

రాఘ‌వ అరెస్ట్ విష‌యంలో పోలీసులు తీవ్ర జాప్యం చేశారని ప్ర‌తిప‌క్షాలు ఆరోపించాయి. సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన వారిని క్ష‌ణాల్లో ప‌ట్టుకునే పోలీసులు.. ఓ కుటుంబాన్ని వేధించిన వ్య‌క్తి ప‌ట్టుకోవ‌డానికి ఇన్ని రోజులు ఎందుకు ప‌ట్టింద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే రాఘ‌వ మాత్రం పోలీసుల‌కు దొర‌క్కుండా త‌ప్పించుకు తిరిగిన‌ట్లు తెలుస్తోంది. ఎక్క‌డిక్క‌క్క‌డ సిమ్ కార్డులు మార్చుతూ పోలీసుల‌కు దొర‌క‌కుండా జాగ్ర‌త్త‌ప‌డిన‌ట్లు స‌మాచారం. విశాఖలో రెండురోజులపాటు తలదాచుకున్న రాఘవ శుక్రవారం అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా పశ్చిమ గోదావరి, భద్రాద్రి జిల్లా సరిహద్దుల్లో మందలపల్లి అడ్డరోడ్డు వద్ద పోలీసుల‌కు చిక్కాడు. అక్క‌డి నుంచి పాల్వంచ ఏఎస్పీ కార్యాల‌యానికి తీసుకువ‌చ్చి అర్థ‌రాత్రి రాఘ‌వ‌ను విచారించారు. శ‌నివారం రాఘ‌వ‌ను కోర్టులో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు.

వనమా రాఘవకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వనమా రాఘవను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం మధ్యాహ్నం కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు అతడిని భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు.