Site icon HashtagU Telugu

Van Mahotsav Program : సత్తుపల్లిలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం..

Spl Vanamo

Spl Vanamo

సత్తుపల్లి (Sathupally ) జేవీఆర్ డిగ్రీ కళాశాల (J.V.R. Government College) ప్రాంగణంలో బుధవారం ఉదయం వన మహోత్సవం కార్యక్రమాన్ని (Van Mahotsav Program) అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రులు కొండా సురేఖ (Minister Konda Surekha), మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే మట్ట రాగమయి (MLA Matta Ragamayee) , ప్రకృతి ప్రేమికులు, అన్ని శాఖల అధికారులు, విద్యార్థులు , నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ.. ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా అనేక స్వచ్ఛంద పనుల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే దంపతులు భాగం అవుతూ అందరికి ఆదర్శం అవుతున్నారని కొనియాడారు. మనిషి మనుగడ కలగాలి అంటే చెట్లను పెంచాలని పిలుపునిచ్చారు. గతంలో పెద్దలు 100 సంవత్సరాలు బతికారు అంటే చెట్లే అని , ప్రతి నిత్యం మనిషి జీవితంలో చెట్లతో అవసరం ఉంటుందన్నారు. చెట్లను నరకటం మహపాపం అని , ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి..కానీ కొట్టెయ్యకండి అని కోరారు. ఒక్కొక్క వ్యక్తి ఐదు నుండి పది మొక్కలు పెంచితే వన మహోత్సవ కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

Spl Vanamo2

అలాగే మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) మాట్లాడుతూ..ప్రజలను భాగస్వామ్యం చెయటం కోసమే మొక్కలు నాటే కార్యక్రమం చెపట్టామన్నారు. గతంలో పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి, చల్లని నీడను ఇచ్చే చెట్లు ఇప్పుడు కనిపించటం లేదన్నారు. భవిష్యత్తు ముందు తరాలకు మంచి జరగాలి అంటే ఇప్పుడు నుండే మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అశోక చక్రవర్తి భవిష్యత్తు గురించి ఆలోచించి మొక్కలు నాటారన్నారు. అవే మొక్కలు రోడ్లకు ఇరువైపులా ఉన్నాయన్నారు. డిపార్టమెంట్ కాక ఇళ్ళలో కూడా మొక్కలు నాటే బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. కాలుష్యం నివారణ చెయ్యాలన్న మొక్కలను పెంచటమే ఒకే ఒక్క మార్గమని తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కను నాటాటమే లక్ష్యంగా భావించి మొక్కలు నాటి లక్ష్యన్ని చెరుకోవాలని కోరారు.

ఎమ్మెల్యే రాగమయి (MLA Matta Ragamayee) మాట్లాడుతూ..వన మహోత్సవం కార్యక్రమానికి వచ్చిన మంత్రులకు స్వాగతం పలికారు. అలాగే ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నఅన్ని స్కూల్స్ విద్యార్థులకు మరియు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక సత్తుపల్లి అనేది సింగరేణి ప్రభావిత ప్రాంతమనే సంగతి తెలిసిందే. ఇక్కడ రోజు రోజుకు కాలుష్యం విపరీతంగా పెరగడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ కాలుష్యం నుండి బయటపడాలంటే పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Read Also : TVS XL 100 Sales: జూన్ నెల‌లో అద‌ర‌గొట్టిన ఎక్సెఎల్ 100.. ఎన్ని అమ్మ‌కాలు జ‌రిగాయంటే..?