Site icon HashtagU Telugu

T.N. Vamshi Tilak : కంటోన్మెంట్ బిజెపి అభ్యర్థిగా డా. టీఎన్ వంశా తిలక్..ఏంటి ఈయన బాక్గ్రౌండ్ ..!!

T.n. Vamshi Tilak

T.n. Vamshi Tilak

తెలంగాణ (Telangana) లో మే 13 న లోక్ సభ (Lok Sabha Elections) ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక (Cantonment Bypoll) కూడా జరగనున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుండి బిఆర్ఎస్ (BRS) అభ్యర్థిగా లాస్య (Lasya) పోటీ చేసి విజయం సాధించింది. కానీ ఆమె కారు ప్రమాదం లో కన్నుమూయడంతో ఆ స్థానం లో ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతుంది. ఇప్పటికే ఈ స్థానం నుండి కాంగ్రెస్ నుంచి శ్రీగణేష్, బీఆర్ఎస్ నుంచి నివేదిత బరిలో నిలువగా..ఈరోజు బిజెపి (BJP) సైతం తమ అభ్యర్థిని ప్రకటించింది. ఈ స్థానం నుంచి డాక్టర్ టీఎన్ వంశా తిలక్‌ (T.N. Vamshi Tilak)ను అభ్యర్థిగా ప్రకటించింది. గత ఎన్నికల్లో బిజెపి నుండి శ్రీగణేష్ పోటీ చేసి రెండో స్థానానికి పరిమితం అయ్యాడు. కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరడంతో.. టీఎన్ వంశా తిలక్‌ను బిజెపి బరిలోకి దింపింది.

We’re now on WhatsApp. Click to Join.

టీఎన్ వంశా తిలక్‌..మాజీ మంత్రి టీఎన్ సదాలక్ష్మి కుమారుడు. బొల్లారం ప్రాంతానికి చెందిన ఈమె.. 1957లో తొలిసారిగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎస్సీ రిజర్వుడు స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ స్పీకర్‌గా, నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో తొలి దళిత దేవాదాయ మంత్రిగా సేవలు అందించి ఎంతో పేరు తెచ్చుకున్నారు. అలాగే 1969లో తెలంగాణ ఉద్యమంలోనూ ఈమె పాల్గొన్నారు. ఆ తర్వాత టిడిపి లో చేరి కొన్నేళ్ల పాటు కొనసాగారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి 2000లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2004లో వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఆ తర్వాత ఈమె కుమారుడు తిలక్..బిజెపి పార్టీ లో కొనసాగుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన్ను కంటోన్మెంట్ అభ్యర్థిగా బరిలోకి దింపింది బిజెపి. తిలక్ మంచి పేరు , గుర్తింపు ఉండడం తో పాటు ఈయన తల్లి కూడా అందరికి సుపరిచితురాలు కావడం తో తిలక్ విజయం ఫై బిజెపి ధీమాగా ఉంది. మరి ప్రజలు ఎవరికీ పట్టం కడతారో చూడాలి.

Read Also : AP : రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేయకపోవడంపై మంత్రి అంబటి క్లారిటీ