Ramulu Naik : ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ మరో భారీ షాక్..మాజీ ఎమ్మెల్యే రాజీనామా

వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్..బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారు

  • Written By:
  • Publish Date - April 19, 2024 / 04:54 PM IST

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ (BRS) కు భారీ షాక్ తగిలింది. వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ (Vaira Ex MLARamulu Naik Resign BRS
)..బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. అలాగే జిల్లా అధ్యక్షుడు తాతా మధుకు కూడా రాజీనామా లేఖను పంపించారు. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ అయిన తనకు కాకుండా మదన్ లాల్‌కు బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వడంతో పార్టీ ఫై అసంతృప్తి తో ఉన్నారు. ఇక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ హావ తగ్గుతుండడం తో…రోజు రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుండడం తో రాములు బిఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

గత వారం రోజులుగా రాములు పార్టీని వీడుతున్న వార్తలు వైరల్ గా మారడంతో ..ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌లు రెండు రోజుల క్రితం ఖమ్మంలోని రాములు నాయక్ నివాసంలో కలిసి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తనకు గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవడమే కాకుండా ఇప్పుడు నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలు కూడా ఇవ్వకపోవడం ఏమిటని ఆయన వారిని ప్రశ్నించారు. దానికి వారు ఏదో చెప్పడం..ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూసి ఈరోజు బిఆర్ఎస్ కు రాజీనామా చేసారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు అతి త్వరలోనే మంత్రి పొంగులేటి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఖమ్మం లో బిఆర్ఎస్ అనేది లేకుండా పోయిందే అని బాధపడుతుండగా..ఇప్పుడు ఈ మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీ కి బై బై చెప్పడం తో బిఆర్ఎస్ అధిష్టానానికి భారీ దెబ్బపడింది.

Read Also : Balakrishna Nomination : హిందూపురంలో నామినేష‌న్ వేసిన బాలకృష్ణ