Site icon HashtagU Telugu

Telangana Congress: కేసీఆర్ జాతీయ పార్టీ పై ఉత్తమ్ విమర్శలు

Uttam Kumar

Uttam Kumar

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టాలనుకుంటున్న జాతీయ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేసీఆర్ తన పద్దతులతో తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారని, ఇప్పుడు దేశాన్ని నాశనం చేయాలనే పని పెట్టుకున్నారని ఉత్తమ్ విమర్శించారు. దేశాన్ని బీజేపీ నాశనం చేస్తోందని కేసీఆర్ మరింత నాశనం చేయాలని చుస్తున్నారని ఆయన తెలిపారు. కేసీఆర్ తన అబద్దాలతో రాష్ట్ర ప్రజలని మోసం చేశారని, ఇక ఆయన మాటలు వినడానికి ఇక్కడి ప్రజలు సిద్ధంగా లేరని అందుకే వేరే రాష్ట్రాల ప్రజలని మోసం చేయడానికి బయల్దేరుతున్నారని ఉత్తమ్ విమర్శించారు.

టీఆర్ఎస్ పార్టీ శరణార్ధుల నిలయంగా, చెత్తబుట్టగా మారిందని ఉత్తమ్ తెలిపారు. ఆ పార్టీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, ఆ పార్టీని రీజనల్ పార్టీ అనేకంటే సబ్ రీజనల్ పార్టీ అనడమే కరెక్టని ఉత్తమ్ అన్నారు.

తెలంగాణలో గెలిచిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొన్నారని, ఇప్పుడు తమ దగ్గరున్న కోట్లాది రూపాయలతో ఇతర రాష్ట్రాల్లో కూడా వేరేపార్టీ నేతలను కొంటారని ఉత్తమ్ ఆరోపించారు.