Site icon HashtagU Telugu

Uttam Kumar : ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్..

Minister Uttam Kumar Reddy

Minister Uttam Kumar Reddy

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే గా గెలిచిన ఉత్తమ్ కుమార్ (Uttam Kumar) రెడ్డి..నేడు తన ఎంపీ (MP Post) పదవికి రాజీనామా (Resign) చేయబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఈ క్రమంలో హుజుర్ నగర్ నుండి భారీ మెజార్టీ తో గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..ప్రస్తుతం నల్లగొండ పార్లమెంటు సభ్యుడు పదవిలో కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే గా విజయం సాధించడంతో ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన ఆయన..మధ్యాహ్నం లోకసభ స్పీకర్ ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. ఈయనతో పాటు పార్లమెంటు సభ్యులుగా ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తమ పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామాలు చేయాల్సి ఉంటుంది. అయితే వారు ఎప్పుడు చేస్తారన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ అధిష్టానం సీఎం గా ఎవర్ని ప్రకటిస్తుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి అంశం పైన ఢిల్లీలో మంతనాలు సాగుతున్నాయి. హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయాధికారం పార్టీ హైకమాండ్ కు అప్పగిస్తూ ఏక వ్యాఖ్య తీర్మానం చేసారు. అదే సమయంలో సీనియర్లు తమ పేర్లు సీఎం పదవికి పరిగణలోకి తీసుకోవాలని డీకే శివకుమార్ ను సూచించారు. తాము పార్టీ కోసం ఎంతో కాలంగా చేసిన సేవలను ఏకరువు పెట్టారు. తెలంగాణలో సామాజిక సమీకరణాలు తెర మీదకు వచ్చాయి. దీంతో, ఇక రేవంత్ ను సీఎంగా ప్రకటిస్తారని అందరూ అనుకుంటున్న సమయంలో సడన్ గా పరిశీలకులను ఢిల్లీ రావాల్సిందిగా హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పుడు ఉత్తమ్..భట్టి కూడా ఢిల్లీ చేరటంతో మరింత ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే సోనియాతో తెలంగాణ వ్యవహారం పైన ఖర్గే, కేసీ వేణుగోపాల్ సమావేశం అయ్యారు. తెలంగాణలో పదవుల ఖరారులో సామాజిక న్యాయం పాటించాలని సోనియా సూచించారని సమాచారం. దీంతో. సీఎంతో పాటుగా పీసీసీ చీఫ్..డిప్యూటీ సీఎం..స్పీకర్..మంత్రి పదవుల పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also : Kodandaram : ప్రొఫెసర్ కోదండరాంకు కీలక పదవి ?