గతంలో ఆయన 2012 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రెండోసారి మంత్రి అయ్యారు. ఎమ్మెల్యేగా వరుసగా 6 సార్లు గెలిచిన చరిత్ర ఉత్తమ్ ది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్ నగర్ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే గా విజయం సాధించి నేడు (డిసెంబర్ 07) మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసారు. ఉత్తమ్ కుమార్ కు హోమ్ శాఖా మంత్రి బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్.
1962, జూన్ 20న సూర్యాపేటలో పురుషోత్తంరెడ్డి- ఉషారాణి దంపతులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మించారు. ఆయన బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత భారత వైమానిక దళంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పైలట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ సేవలో తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత భారత రాష్ట్రపతి భవన్ లో సేవలు అందించారు. రాష్ట్రపతి విదేశీ ప్రయాణాల్లో సెక్యూరిటీ ప్రొటోకాల్ కంట్రోలర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎనలేని సేవలు అందించారు. అలాంటి ఒక గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి ఎంతో సంతోషంగా తన జీవితాన్ని గడిపేయచ్చు. రిటైర్ అయిన తర్వాత భార్యాపిల్లలు, మనువలు, మనవరాళ్లు అంటూ జీవితాన్ని సంతోషంగా గడిపేయచ్చు. కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ దారిని ఎచుకోలేదు. ముళ్లుంటాయని తెలిసినా రాజకీయాల్లోకి రావాలి అనుకున్నారు. దేశ సేవ చాలించి.. ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజా సేవ, రాజకీయాలు అంటే అవమానాలు, విమర్శలు, ఛీత్కారాలు ఉంటాయని తెలిసినా కూడా కావాలనే రాజకీయాల్లోకి వచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలిసారిగా 1994లో కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీ కి ఎన్నికయ్యాడు. 2004 శాసనసభ ఎన్నికలలో కోదాడ నుండి రెండవసారి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యాడు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడ్డ హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి 2009 లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశాడు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి పై 25,682 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అతను తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కమిటీ అధ్యక్షునిగా 2015 నుండి పనిచేస్తున్నాడు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహ, బలహీన వర్గాలకు కేబినెట్ మంత్రిగా పనిచేసాడు.
Read Also : Bhatti sworn in as Deputy CM : డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం